Affordable Electric Scooter: పెట్రోల్ ధరల భారం పడడంతోపాటు.. పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. చాలామంది పెట్రోల్ ధరల విషయమై ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్నో రకాల కంపెనీలు మార్కెట్లోకి EV లు తీసుకువచ్చాయి. కానీ కొన్నిటికి మాత్రమే ఆదరణ పెరిగిపోతుంది. ఇటీవల ఓ కంపెనీకి చెందిన స్కూటర్లు భారీ స్థాయిలో విక్రయాలు జరుపుకుంటున్నాయి. 2026 సంవత్సరంలో ఒక్క జనవరిలోనే 13,830 యూనిట్ల అమ్మకాలు చేసుకుంది. అయితే గత సంవత్సరంలో కంటే ఇప్పుడు 107% అధికంగా అమ్ముడుపోవడం విశేషం. ఇంతకీ ఎక్కువగా ఆదరణ పొందుతున్న ఆ స్కూటర్లు ఏవో తెలుసా..?
పెట్రోల్ ధరల తో పాటు బైక్ ధరలు కూడా అధికంగా కావడంతో చాలామంది ఈ వీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ హీరో రెండు ప్రధాన స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వాటిలో Vida V2, Vida VX2 అలదిస్తున్నాయి. అయితే వీటిలో Vida V2 స్కూటర్ వినియోగదారుల నుంచి ఎక్కువగా ఆదరణ పొందుతుంది. ఇందులో ఉండే ఫీచర్లతో పాటు బ్యాటరీ ప్యాక్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు. ఈ రెండు స్కూటర్లలో Vida V2 స్కూటర్ ను Vida V2 Plus, Vida V2 Pro అనే రెండు వేరియంట్లలో అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లలో 3.44 kWh బ్యాటరీ ప్యాక్ సమాచారం. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 143 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రోజువారి ప్రయాణికులతో పాటు నగరాల్లో ఉండే వారికి ఈ స్కూటర్ అనుకూలంగా ఉంటుంది. గంటకు 85 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ స్కూటర్పై చిన్నపాటి ఫ్యామిలీ కూడా ప్రయాణం చేయవచ్చు.
అలాగే మరో వేరియంటు Vida V2 Pro సైతం అత్యధికంగా విక్రయాలు జరుపుకుంటుంది. ఈ మోడల్ లో 3.94 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. అలాగే ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఫీచర్స్ ఉన్నాయి. మొబైల్ కనెక్టివిటీ, యుఎస్బి చార్జింగ్ పోర్టు వంటివి డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మొబైల్ కనెక్టివిటీ నావిగేషన్ వంటివి ప్లస్ పాయింట్ గా ఉన్నాయి. ఇక ఈ మోడల్ లో విడా విఎక్స్2 స్కూటర్ ధర రూ. 73,850 నుంచి రూ. 94,800 వరకు విక్రయిస్తున్నారు. మిగతా ఈవీల కంటే ఈ స్కూటర్ ధర తక్కువగా ఉండడంతో పాటు ఆకట్టుకునే స్మార్ట్ ఫీచర్స్ ఉండడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు . అలాగే ఈ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తున్నారు.