చెన్నమనేని పౌరసత్వం కేసు: కేంద్ర హోంశాఖపై హైకోర్టు ఆగ్రహం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కేంద్ర హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన అఫిడవిడ్ కాకుండా కేవలం మెమో దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి పౌరుని వివరాలు రాబట్టకపోతు ఎందుకు మీ హోదాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చెన్నమనేని జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్లీ కేంద్ర హోంశాఖ ఇవ్వడంపై హైకోర్టు […]

Written By: Suresh, Updated On : December 16, 2020 2:23 pm
Follow us on

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కేంద్ర హోంశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించిన అఫిడవిడ్ కాకుండా కేవలం మెమో దాఖలు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి పౌరుని వివరాలు రాబట్టకపోతు ఎందుకు మీ హోదాలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చెన్నమనేని జర్మన్ పౌరుడు అని ఇచ్చిన మెమోనే మళ్లీ కేంద్ర హోంశాఖ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి సమాచారం తీసుకొని అఫిడవిట్ వేయాలని కేంద్ర హోంశాఖకు సూచించింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.