ప్రపంచానికి రిలీఫ్.. కరోనా వ్యాక్సిన్ తొలి టీకా పంపిణీ

చైనాలోని వూహాన్ లో పుట్టిన మహమ్మారి ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికించింది. లక్షలమంది ప్రాణాలు తీసింది. ఇంకా తీస్తూనే ఉంది. మందులు, చికిత్స లేని ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రపంచమే బంద్ అయిపోయి లాక్ డౌన్ తో ఇంట్లో కూర్చుంది. దాదాపు ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి నుంచి ప్రపంచానికే గొప్ప ఊరటనిచ్చే విషయం చోటుచేసుకుంది. Also Read: విషాదం.. కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి.. ప్రపంచంలోనే తొలిసారి..! అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ […]

Written By: NARESH, Updated On : December 15, 2020 10:31 am
Follow us on

చైనాలోని వూహాన్ లో పుట్టిన మహమ్మారి ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికించింది. లక్షలమంది ప్రాణాలు తీసింది. ఇంకా తీస్తూనే ఉంది. మందులు, చికిత్స లేని ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రపంచమే బంద్ అయిపోయి లాక్ డౌన్ తో ఇంట్లో కూర్చుంది. దాదాపు ఏడాదిగా పీడిస్తున్న ఈ మహమ్మారి నుంచి ప్రపంచానికే గొప్ప ఊరటనిచ్చే విషయం చోటుచేసుకుంది.

Also Read: విషాదం.. కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి.. ప్రపంచంలోనే తొలిసారి..!

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం మొదలైంది. ప్రజలకు వ్యాక్సిన్ చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. అప్పటివరకు మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని తెలిపింది. న్యూయార్క్ రాష్ట్రంలో మొత్తం 35వేల మందికి ఇవ్వనున్నారు. అమెరికా మొత్తం మీద 2,99,000 ఈ వైరస్ బారిన పడ్డారు.

న్యూయార్క్ లో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ టీకాను నల్లజాతీయురాలైన సాండ్రా లిండ్సే అనే నర్సుకు ఇచ్చారు. అమెరికాలో కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ‘ఫైజర్-బయో ఎంటెక్’ తొలి టీకాను వేసుకున్నారు. తొలి టీకా వ్యాక్సినేషన్ ఘట్టాన్ని అమెరికాలోని అన్ని చానెల్స్ లో లైవ్ ఇచ్చి ప్రజల్లో ప్రభుత్వం భరోసాను నింపింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. ‘మొదటి వ్యాక్సిన్ డోసు పడింది. కంగ్రాట్స్ అమెరికా.. కంగ్రాట్స్ వరల్డ్’ అంటూ ట్రంప్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

Also Read: గూగుల్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం

తొలి టీకా తీసుకున్న నర్సు సాండ్రా లిండ్సే మాట్లాడుతూ ‘అమెరికాలో కరోనా తొలి వ్యాక్సిన్ ను తీసుకోవడం గొప్పగా భావిస్తున్నాను. నాకు ఉపశమనం కలుగుతుంది’ తెలిపింది. ఇది అమెరికా చరిత్రలోనే బాధాకరమైన సమయం ముగిసినట్లుగా సూచిస్తోందని నమ్ముతున్నానని తెలిపారు. టీకా సురక్షితం అని.. ప్రజలకు విశ్వాసం కలిగించానని అన్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్