తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. ఇక సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే అనూహ్యమైన పరిణామం చోటుచేసుకోవడం ఢిల్లీలో చర్చనీయాంశమైంది.
Also Read: ఏపీ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఫీజులు రద్దు చేసిన జగన్ సర్కార్..?
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఏపీ, తెలంగాణ హైకోర్టులు మండిపడుతున్నాయి. ఏపీలో అయితే సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బోలెడు తీర్పులు వచ్చాయి. దీనిపై సీఎం జగన్ ఏకంగా చీఫ్ జస్టిస్ కు లేఖ కూడా రాశాడు. అమరావతి కుంభకోణంపై ఏపీ హైకోర్టు గాగ్ ఆర్డర్ ఇవ్వడం దుమారం రేపింది.
ఈ క్రమంలోనే సీఎంల ఢిల్లీ టూర్ తర్వాత అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని తాజాగా సుప్రీం కోర్టు కోలిజియం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వీరితోపాటు దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల న్యాయమూర్తులను సైతం బదిలీ చేస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా ఏడు నుంచి ఎనిమిది మంది హైకోర్టు న్యాయమూర్తులను కూడా బదిలీ చేయాలని కోలీజియం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Also Read: విషాదం.. కరోనాతో ఆ దేశ ప్రధాని మృతి.. ప్రపంచంలోనే తొలిసారి..!
ఢిల్లీలో ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో కూడిన కోలీజియం సమావేశమైంది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ తోపాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కోలీజియం తీర్మానించినట్టు తెలిసింది.
కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా సీనియర్ జడ్జిలను నియమించనున్నట్టు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను ఏ రాష్ట్రాలకు బదిలీ చేశారనే విషయం.. వారి స్థానంలో కొత్తగా ఎవరిని నియమిస్తారనే విషయం మరో రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్