Also Read: ఐపీఎల్ లో ధోనీ ఆల్ టైం రికార్డు!
ఐపీఎల్ తర్వాత ఐసీసీ సైతం అంతర్జాతీయ మ్యాచులకు అనుమతి ఇచ్చింది. తొలుత ప్రేక్షుకులు లేకుండా మ్యాచులు జరుగగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనా నిబంధనలను అమలు చేస్తూ ప్రేక్షకులను సైతం స్టేడియంలోకి అనుమతి ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొంతకాలంగా బౌలర్లకు జరుగుతున్న అన్యాయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ-20 ఫార్మాట్ వచ్చినప్పటి నుంచి నిబంధనలన్నీ కూడా బ్యాట్స్ మెన్స్ కే అనుకూలంగా మారుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నోబాల్ తర్వాత ఫ్రీ హిట్.. బరువైన.. వెడల్పు అయిన బ్యాట్‌ల వాడకానికి అనుమతివ్వడం వంటి నిబంధనలన్నీ బ్యాట్స్ మెన్ కే అనుకూలంగా ఉన్నాయి. ఇక తాజాగా ఐసీసీ బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించంపై సచిన్ స్పందించారు.
Also Read: వన్డే సిరీస్ పాయే..టీంఇండియా టీంలో అనూహ్య మార్పులు?
బౌలర్లు బంతి రివర్స్ స్వింగ్ అవ్వడానికి కొన్ని దశాబ్దాలుగా ఉమ్మి.. చెమటను రుద్దుతున్నారని తెలిపారు. ఐసీసీ తాజా నిబంధనల వల్ల బౌలర్లు ఇకపై మంచి బంతులు వేయడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు.
బంతికి ఉమ్మి రాయకూడదనే నిబంధన విధించడం వల్ల ఐసీసీ బౌలర్లను వికలాంగులుగా మార్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. బంతిపై చెమటను రాసే వీలున్నప్పటికీ అది ఉమ్మి అంత ప్రభావం చూపలేదని తనతో చాలామంది బౌలర్లు చెప్పారని సచిన్ తెలిపారు.
ఈ విషయంలో ఐసీసీ పునారోచించాలని కోరారు. లేనట్లయితే ఉమ్మికి ప్రత్యామ్నాయం బౌలర్లకు చూపించాల్సిన అవసరం ఐసీసీ ఉందని స్పష్టం చేశారు. సచిన్ సూచనలను ఐసీసీ ఏమేరకు పరిగణలోకి తీసుకుంటుందో లేదో వేచిచూడాల్సిందే..!