https://oktelugu.com/

బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేవాళ్లకు ఆర్బీఐ శుభవార్త..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్లకు అదిరిపొయే శుభవార్తలు చెబుతోంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఫలితంగా ఆర్బీఐ రెపో రేటు 4 శాతం దగ్గర, రివర్స్ రెపో రేటు 3.35 శాతం దగ్గర కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఆర్బీఐ గత సమీక్షల్లో సైతం వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది. Also Read: ఒక్క రూపాయి కట్టకుండానే కారు కొనే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 4, 2020 / 08:34 PM IST
    Follow us on


    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్లు ఉన్నవాళ్లకు అదిరిపొయే శుభవార్తలు చెబుతోంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్బీఐ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఫలితంగా ఆర్బీఐ రెపో రేటు 4 శాతం దగ్గర, రివర్స్ రెపో రేటు 3.35 శాతం దగ్గర కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఆర్బీఐ గత సమీక్షల్లో సైతం వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించింది.

    Also Read: ఒక్క రూపాయి కట్టకుండానే కారు కొనే ఛాన్స్.. ఎలా అంటే..?

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యూ3లో జీడీపీ 0.1 శాతంగా, క్యూ4 జీడీపీ 0.7 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ జీడీపీ వృద్ధి -7.5 శాతంగా ఉందని అంచనా వేసినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేట్లను కొనసాగించడం వల్ల బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతోంది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బ్యాంకుల వడ్డీరేట్లలో కూడా మార్పులు లేవని తెలుస్తోంది.

    Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ..?

    ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవడంతో బ్యాంకులు సైతం ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ రేట్లలో మార్పులు లేకపోవడం వల్ల రుణాలు తీసుకున్న వాళ్లకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. రివర్స్ రెపో రేటులో మార్పులు చేస్తే బ్యాంకులు రుణ రేట్లలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. రుణ రేట్లు తగ్గే అవకాశం లేకపోవడం ఖాతాదారులకు మైనస్ గా మారుతోంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఆర్బీఐ ఖాతాదారులకు మేలు జరిగేలా డెబిట్, క్రెడిట్ కార్డుల విషయంలో, ఆర్టీజీఎస్ లావాదేవీల విషయంలో కీలక మార్పులు చేసింది.