కొత్త ఏడాదిలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ డిసెంబర్ 31న పార్టీ ప్రకటిస్తానని గతంలోనే ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. అరగంటలో తక్కువ వడ్డీతో రుణం తీసుకునే ఛాన్స్..?
ఈక్రమంలోనే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కు వచ్చిన రజనీ అస్వస్థతకు గురయ్యాడు. రెండ్రోరోజులపాటు ఆస్పత్రిలోనే ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో.. సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొన్నాయి. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీ తాను రాజకీయాలను తప్పుకుంటున్నట్లు తాజాగా ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశాడు.
తమిళనాడులో సినిమాలకు.. రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఎంజీఎం.. జయలిలిత లాంటివాళ్లు తమిళనాడు రాజకీయాలను శాసించారు. మరేందరో సెలబ్రెటీలు ఎంపీలు.. ఎమ్మెల్యే.. కేంద్రమంత్రులుగా రాణించారు. తమిళనాడు ప్రజలు సినిమావాళ్లను ఆదరిస్తుండటంతో నటీనటులు సైతం రాజకీయాల్లో వచ్చేందుకు ఇంట్రెస్టు చూపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో లోకనాయకుడు కమల్ హాసన్ సైతం బరిలో నిలువనున్నాడు. తాజాగా రజనీకాంత్ రాజకీయాల నుంచి వెనక్కి తగ్గడంతో మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇళయదళపతి విజయ్ ఈనెల 31న తన పార్టీని ప్రకటించనున్నారనే ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది.
Also Read: ఆయనే ఓ పెద్ద బోడిలింగం..: పవన్‌పై కొడాలి ఫైర్
విజయ్ పీపుల్స్ ఉద్యమంగా ఉన్న సంస్థను ఆయన పార్టీగా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకం’గా విజయ్ పార్టీ పేరు ఉండబోతుందని సమాచారం. అన్నాడీఎంకు మద్దతుగా విజయ్ తన పార్టీని స్థాపించనున్నారనే టాక్ విన్పిస్తోంది.
డిసెంబర్ 31న జయలలిత సమాధి దగ్గర విజయ్ తన పార్టీ పేరును ప్రకటించన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇళయదళపతి విజయ్ పార్టీ ప్రకటిస్తాడా? లేదా అనేది రెండ్రోజుల్లో తేలడం ఖాయంగా కన్పిస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ హీరోల ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్