https://oktelugu.com/

సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ కోసం.. సుకుమార్ టీమ్ సర్వం సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 20 నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనట. ఫారెన్ లొకేషన్స్ లో సాంగ్స్ తీయాలని మొదట అనుకున్నా.. ఇప్పుడు అది సాధ్యమయ్యే పని కాదు, […]

Written By:
  • admin
  • , Updated On : August 19, 2020 / 02:58 PM IST
    Follow us on


    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ కోసం.. సుకుమార్ టీమ్ సర్వం సిద్ధం అవుతున్నారు. అక్టోబర్ 20 నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ప్లేస్ లో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సెట్స్ కేవలం సాంగ్స్ కోసమేనట. ఫారెన్ లొకేషన్స్ లో సాంగ్స్ తీయాలని మొదట అనుకున్నా.. ఇప్పుడు అది సాధ్యమయ్యే పని కాదు, అందుకే సెట్స్ వేసి.. ఆ సెట్స్ లోనే రెండు సాంగ్స్ ను తీయబోతున్నారు. ముందుగా బన్నీ – రష్మిక పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయనున్నారు.

    Also Read: అరె.. లేడీ సూపర్ స్టార్ కి మళ్ళీ పెళ్లి !

    ఈ సాంగ్ ను సత్య మాస్టర్ నేతృత్వంలో తీయబోతున్నట్లు.. సాంగ్ లో కాస్త రొమాన్స్ ఎక్కువే ఉండబోతున్నట్లు.. రష్మిక చేత ఈ సాంగ్ లో బికినీ రేంజ్ లో కనిపించేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సాంగ్ తరువాత సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్‌ హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఇంకా ఎవరు సెట్ కాలేదు. దాంతో యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఫైనల్ చేసే ప్లాన్ లో ఉందట చిత్రబృందం.

    Also Read:  మెగా ఫ్యాన్స్ కి మెగా ట్రీట్ !

    అలాగే తమిళ మాజీ హీరో మాధవన్ కూడా ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ లో మాధవన్ చేయనున్నాడు. ఇక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాలి, కానీ.. ఈ కరోనా కాలంలో అది అంత ఈజీ కాదు, అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో అటవి సెటప్ వేసి.. అక్కడే ఎక్కువ భాగం షూట్ చేయాలని సుకుమార్ ప్లాన్. అయితే సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేస్తారట. కానీ, భారీ సినిమాని తక్కువమంది టీమ్ తో చేయడం సాధ్యమయ్యే పనేనా అంటే.. అనుమానమే.