https://oktelugu.com/

వామ్మో.. తాజ్ మహల్ వద్ద ఏడు అడుగుల కొండ చిలువ!

  సాధారణంగా ప్రేమ బంధానికి చిహ్నమైన తాజ్ మహల్ ను చూడటానికి ప్రేమికులు వస్తూ ఉంటారు. అయితే తాజాగా తాజ్ మహల్ ను చూడటానికి ఒక కొండ చిలువ వచ్చింది. వినడానికి కొంచెం సరదాగా అనిపించినా నిత్యం ఎంతోమంది సందర్శించే తాజ్ మహల్ దగ్గర ఒక కొండ చిలువ పట్టుబడింది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా మన దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాల వల్ల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 19, 2020 / 02:55 PM IST
    Follow us on

     

    సాధారణంగా ప్రేమ బంధానికి చిహ్నమైన తాజ్ మహల్ ను చూడటానికి ప్రేమికులు వస్తూ ఉంటారు. అయితే తాజాగా తాజ్ మహల్ ను చూడటానికి ఒక కొండ చిలువ వచ్చింది. వినడానికి కొంచెం సరదాగా అనిపించినా నిత్యం ఎంతోమంది సందర్శించే తాజ్ మహల్ దగ్గర ఒక కొండ చిలువ పట్టుబడింది. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని తేడా లేకుండా మన దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

    వర్షాల వల్ల జంతువులు, సర్పాలు అరణ్య ప్రాంతాల నుంచి జనావసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఆగ్రాలోని తాజ్ మహల్ పరిసరాల్లో కొండ చిలువ కలకలం సృష్టించింది. లాక్ డౌన్ నిబంధనల్లో భాగంగా మార్చి నెల చివరి వారం నుంచి తాజ్ మహల్ ను అధికారులు మూసివేశారు. దీంతో సందర్శకులు లేక సందర్శకులతో కిటకిటలాడే తాజ్ మహల్ వెలవెలబోతుంది. జనం సంచరించని తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లొ ఏడు అడుగుల కొండ చిలువను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.

    వెంటనే కొండ చిలువ గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వైల్డ్ లైఫ్ ఎన్.ఓ.ఎస్ బృందానికి కొండ చిలువ గురించి సమాచారం ఇచ్చి దానిని పట్టుకోవాలని కోరారు. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని కొండ చిలువను తీసుకొని వెళ్లి సమీపంలో ఉన్న అడవిలో వదిలేశారు. పశ్చిమ భాగంలో ఉన్న తాజ్ మ్యూజియం వెలుపల అధికారులు కొండ చిలువను గుర్తించినట్లు సమాచారం. కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.