https://oktelugu.com/

వైసీపీ, బీజేపీ ‘ఫ్లెక్సీల’ వార్..

ఏపీలో అధికార వైసీపీతో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది. అధికార పక్షాన్ని దూకుడుగా ఎదుర్కొంటోంది. ఏపీలోని ప్రతి జిల్లాలోనూ బీజేపీ శ్రేణులు వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి విషయాన్ని ఎత్తి చూపుతూ డిఫెన్స్ లో పడేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీల చిచ్చు బీజేపీ, వైసీపీ మధ్య చిచ్చుపెట్టింది. Also Read: జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్ తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2020 / 08:59 PM IST
    Follow us on

    ఏపీలో అధికార వైసీపీతో బీజేపీ ఢీ అంటే ఢీ అంటోంది. అధికార పక్షాన్ని దూకుడుగా ఎదుర్కొంటోంది. ఏపీలోని ప్రతి జిల్లాలోనూ బీజేపీ శ్రేణులు వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి విషయాన్ని ఎత్తి చూపుతూ డిఫెన్స్ లో పడేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఫ్లెక్సీల చిచ్చు బీజేపీ, వైసీపీ మధ్య చిచ్చుపెట్టింది.

    Also Read: జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్

    తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించడం వివాదాస్పదమైంది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రోద్బలంతోనే వైసీపీ నేతలు ఇలా బీజేపీ ఫ్లెక్సీలు తీసేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ నేతల ఫ్లెక్సీలపై లేని అభ్యంతరం బీజేపీ ఫ్లెక్సీలపై ఎందుకొచ్చిందని మండిపడుతున్నారు. అధికార పార్టీకి బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు.

    ఇప్పటికే దివంగత ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ తొలగించడంతో సొంత వైసీపీ పార్టీలోనే పెద్ద వివాదం చెలరేగింది. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే వైసీపీలోని ఆ విభేదాలు చల్లారకముందే ఇప్పుడు బీజేపీ ఫ్లెక్సీలు కూడా తొలగించడంతో వైసీపీ ఇరుకునపడింది.

    Also Read: ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ యాప్ తో అన్ని సేవలు పొందే ఛాన్స్..?

    నెల్లూరు బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని కమలం పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. నెల్లూరులో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం బీజేపీ, వైసీపీల మధ్య రగులుకుంటోంది. వైసీపీలో అంతర్గత వివాదం చల్లారకముందే మరోసారి బీజేపీతో ఫ్లెక్సీల గొడవ రాజుకుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్