డేంజర్ వేవ్: దేశంలో పెరిగిపోతున్న యూకే కొత్త కరోనా కేసులు

బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ భారత్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నెల 23 నుంచి 31 వరకు భారత్ ఇప్పటికే బ్రిటన్ కు విమాన రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. 23వ తేది అర్ధరాత్రి వరకూ వేలసంఖ్యలో ప్రయాణికులు యూకే నుంచి భారత్ చేరుకున్నారు. Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వారికి అదిరిపోయే శుభవార్త.. ? రెండు రోజుల క్రితం ఆయా రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిటన్ నుంచి […]

Written By: NARESH, Updated On : December 27, 2020 6:50 pm
Follow us on

బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ భారత్ లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నెల 23 నుంచి 31 వరకు భారత్ ఇప్పటికే బ్రిటన్ కు విమాన రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. 23వ తేది అర్ధరాత్రి వరకూ వేలసంఖ్యలో ప్రయాణికులు యూకే నుంచి భారత్ చేరుకున్నారు.

Also Read: ఆదాయపు పన్ను చెల్లించే వారికి అదిరిపోయే శుభవార్త.. ?

రెండు రోజుల క్రితం ఆయా రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిటన్ నుంచి తెలంగాణకు 358 మంది.. ఢిల్లీకి దాదాపు 7వేల మంది.. చెన్నైకి 1088 మంది వచ్చారు. రాష్ట్రాల ఆరోగ్య అధికారులు వీరిని ట్రాక్ చేసే పనిలో పడ్డారు.

కేరళలోనూ యూకే నుంచి వచ్చిన 8మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. వీరి శాంపిల్స్ ను ఫూణే వైరాలజీ ల్యాబ్ కు పంపారు.దీంతో అన్ని రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో ఇప్పుడు కోవిడ్ నిబంధనలు మరింత టైట్ చేసి పరీక్షలు చేస్తున్నారు.

Also Read: రైతుల కోసం ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పిన ఆర్ఎల్పీ..!

బ్రిటన్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన వారిలో తాజాగా 14 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. వీరి నమూనాలు తీసి పూణే జాతీయ ల్యాబ్ కు పంపారు.

ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో యూకే నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు