https://oktelugu.com/

జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్

జగన్ సర్కార్ మెడపై కత్తి వేలాడుతోంది. గత చంద్రబాబు ప్రభుత్వం.. అంతకుముందు ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి ఫ్రెష్ గా మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం వివాదాస్పదమైంది. ఇప్పటికే విద్యుత్ సహా పలు ఒప్పందాలు జగన్ ప్రభుత్వం రద్దు చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు చేసి ఏపీ సర్కార్ తీవ్ర ఇరకాటంలో పడింది. అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు చేసుకోవడంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. విశాఖ మన్యం గనులు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2020 / 08:50 PM IST
    Follow us on

    జగన్ సర్కార్ మెడపై కత్తి వేలాడుతోంది. గత చంద్రబాబు ప్రభుత్వం.. అంతకుముందు ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసి ఫ్రెష్ గా మళ్లీ ఒప్పందాలు చేసుకోవడం వివాదాస్పదమైంది. ఇప్పటికే విద్యుత్ సహా పలు ఒప్పందాలు జగన్ ప్రభుత్వం రద్దు చేయడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు చేసి ఏపీ సర్కార్ తీవ్ర ఇరకాటంలో పడింది. అంతర్జాతీయ ఒప్పందాలు రద్దు చేసుకోవడంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహంగా ఉంది. విశాఖ మన్యం గనులు తీసుకున్న యూఏఈ కంపెనీ రాకియా ఒప్పందాలు రద్దుచేసుకున్నందుకు ఏపీ ప్రభుత్వంపై ఇప్పుడు కేంద్రం మండిపడుతోంది. రాకియాతో సంప్రదింపులు జరిపి ఏదో ఒకటి తేల్చాలని ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. దీంతో జగన్ ప్రభుత్వం ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ వేసి ప్రత్యామ్మాయ మార్గాలు వెతుకుతోంది.

    Also Read: ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఆ యాప్ తో అన్ని సేవలు పొందే ఛాన్స్..?

    రాకియా అన్‌రాక్‌ అల్యూమినియంలో పెట్టుబడిగా పెట్టిన 44.71 మిలియన్‌ డాలర్ల వాటాను ప్రభుత్వమే కొనుగోలు చేయక తప్పని పరిస్ధితి నెలకొంది. కాబట్టి ఆ దిశగా అధికారుల కమిటీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాటను ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తే రాకియా ఆంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది

    ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు కొన్ని రద్దు చేశారు. ఈ క్రమంలోనే విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల కోసం గతంలో యూఏఈకి చెందిన రాకియా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఏపీ సర్కార్ రద్దు చేసుకుంది. రాకియా సంస్థ విశాఖలో ఏర్పాటు చేసిన అన్ రాక్ అల్యూమినియం జాయింట్ వెంచర్లో పెట్టిన పెట్టుబడి పెట్టింది. ఇందులోని రాకియా వాటాను తిరిగి ఇచ్చేయడం ద్వారా అంతర్జాతీయ కోర్టుల్లో నలుగుతున్న ఆర్బిట్రేషన్ వివాదం నుంచి బయటపడేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ఆరుగురు అధికారుల కమిటీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    Also Read: విశాఖలో తీవ్ర ఉద్రిక్తత: టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ

    వైఎస్ఆర్ హయాంలో విశాఖ జిల్లాలో రెండు బాక్సైట్ ఒప్పందాలు జరిగాయి. 2005లో జిందాల్ సంస్థతో, 2007లో యూఏఈలోని రస్ అల్ ఖైమా ప్రభుత్వ సంస్థ అన్ రాక్ తో ఈ ఒప్పందాలు జరిగాయి. 30 ఏళ్ల పాటు బాక్సైట్ సరఫరాకు ఏపీ ఖనిజావృద్ధి సంస్థకు బాధ్యతలు అప్పగించారు. బాక్సైట్ లీజులను పూర్తిగా రద్దు చేయడంతో ఏపీ సర్కార్ తోపాటు భారత ప్రభుత్వాన్ని కూడా రాకియా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కు లాగింది. దీంతో కేంద్రప్రభుత్వంతోపాటు జగన్ సర్కార్ కూడా ఇరుకునపడింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్