విలక్షణ నటుడు.. మహానటుడు.. జాతీయ అవార్డు పొందిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్ రెండు రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నాడు. ఇందుకు ఆయన పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయడమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను‘ఊసరవెళ్లి’ అనడంతో జనసేన ఫ్యాన్స్ ప్రకాశ్ రాజ్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో మధ్యలోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆయనపై కూడా ఎడాపెడా ఘాటు వ్యాఖ్యలు చేయడంతో సీన్ రచ్చరచ్చగా మారింది. దీంతో రంగంలోకి దిగిన జనసైనికులు ప్రకాశ్ రాజ్ బ్యాక్ రౌండ్ ను అంతా తోడేశారు. ఆయన చేసిన తప్పల గుట్టును రట్టు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జనసేన అధినేత పవన్ ముందుగా ఒంటరిగా పోటీలో ఉంటామని చెప్పి ఆ తరువాత బీజేపీకి మద్దు ఇస్తున్నట్లు ప్రకటించాడు. తమ పార్టీ నాయకులు ఎక్కడా పోటీ చేయరని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ప్రకాశ్ రాజ్ మట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎప్పటికప్పడు పార్టీలు మారడం కరెక్టు కాదని, ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నాడని వ్యాఖ్యానించాడు. అలాగే ప్రాంతీయంగా పార్టీ స్థాపించినప్పడు జాతీయ పార్టీలతో వెళ్లడం సమంజసం కాదన్నారు.
Also Read: ‘జనసైన్యం’లో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ జనసేన ఫ్యాన్స్ ప్రకాశ్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ ను వెతికారు. అయితే కొన్నింటిని వారు సోషల్ మీడియాలో పెట్టి ఏకీ పారేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడంపై తాము తప్పుపట్టడం లేదని, అయితే మా అధినేతపై విమర్శలు చేస్తారా..? అని కామెంట్లు పెట్టారు. ప్రకాశ్ రాజ్ తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తతకు తీసుకున్నాడు. అయితే తాను దత్తత తీసుకోగానే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రకాశ్ రాజ్ ను మెచ్చుకుంది.
Also Read: గ్రేటర్ లో పవన్ అందుకే ప్రచారం చేయలేదా?
అసలు విషయమేమిటంటే దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లి గ్రామానికి సమీపంలో ప్రకాశ్ రాజ్ ఫాంహౌజ్ ఉంది. అదే ప్రాంతంలో ఆయనకు చాలా ఎకరాల భూములున్నాయి. వీటిని కాపాడుకోవడానికే ఆయన కేసీఆర్ కు మద్దతిస్తున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా దత్తత తీసుకున్న గ్రామానికి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అయితే సాయం విషయం తమకు అనవసరమే అయినా ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ ప్రజలను బీజేపీ, జనసేన కూటమి నుంచి కాపాడాలని తాను నడుం బిగించినట్లు చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం: తెలంగాణ పాలిటిక్స్
మొన్న వరదలు సంభవించినప్పడు ప్రజలు కొట్టుకుపోతుంటే హైదరాబాద్ గుర్తుకు రాలేదా..? అని ప్రకాష్ రాజ్ ను పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో వరదలు వచ్చినప్పడు సాయం చేసిన ప్రకాశ్ రాజ్ తనను ఆదరించిన హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వడానికి చేతులు రాలేదా..? అని కామెంట్లు పెట్టారు. కేవలం తన భూములను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ కు మద్దతునిస్తూ తాను పెద్ద సమాజసేవకుడిలా ఎందుకు ప్రగల్భాలు పలకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.