త్వరలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న జో బైడెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన పెంపుడు కుక్కతో ఆడుకుంటుండగా జారిపడడంతో ఆయన చీలమండలంకు గాయమైంది. దీంతో బైడెన్ డెలావేర్ లోని అర్థోపెడిక్ డాక్టర్ ను కలిసి చికిత్స తీసుకున్నట్లు బైడెన్ కార్యాలయం పేర్కొంది. 2018లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా బైడెన్ జారిపడ్డాడు. అయితే బైడెన్ కాలు ఎముకలు విరిగాయని వార్తలు వచ్చాయని, కానీ చిన్న గాయం మాత్రమే అయిందని బైడెన్ కార్యాలయం తెలిపింది. కేవలం కాలు బెనికిందని అన్నారు. కాగా త్వరలో వైట్ హౌజ్ కు వెళ్ల బైడెన్ తో పాటు తన రెండు పెంపుడు కుక్కలు కూడా ఆయనతో వెళ్లనున్నాయి.