https://oktelugu.com/

ఆసియాలోనే తొలి వ్యక్తి మన విరాట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్ టీంను నడిపించడంలోనే కాదు.. పరుగులు చేయడం లోనూ ప్రపంచంలో విరాట్ కు సాటి ఎవరూ లేరు. ఇప్పటికే సెంచరీలతో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ తాజాగా క్రికెట్ యేతర విషయాల్లో రికార్డు సృష్టించాడు. కోహ్లీ తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ లో పదికోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2021 / 02:13 PM IST
    Follow us on

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. భారత క్రికెట్ టీంను నడిపించడంలోనే కాదు.. పరుగులు చేయడం లోనూ ప్రపంచంలో విరాట్ కు సాటి ఎవరూ లేరు. ఇప్పటికే సెంచరీలతో రికార్డులు సృష్టించిన విరాట్ కోహ్లీ తాజాగా క్రికెట్ యేతర విషయాల్లో రికార్డు సృష్టించాడు.

    కోహ్లీ తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ లో పదికోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. ఇక ఆసియాలోనే తొలి సెలబ్రిటీగా అవతరించాడు.

    ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫుట్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సీలు ఇన్ స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోనాల్డో 26.6 కోట్ల మందితో ఫస్ట్ ప్లేసులో ఉండగా.. మెస్సీ 18.7 కోట్ల మందితో ఉన్నాడు.

    ఇక విరాట్ కోహ్లీ తర్వాత ఇండియాలో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనికి ఫాలోవర్స్ 3.4 కోట్ల మంది ఉన్నారు. ధోని కంటే కోహ్లీకి మూడింతల మంది ఫాలోవర్స్ ఎక్కువ.

    ఇక విరాట్ తర్వాత భారత్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నది బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, శ్రద్ధ కపూర్, ప్రియాంకను 6 కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు.