https://oktelugu.com/

ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా 40 కోట్ల కంటే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్బీఐ ఎన్నో సర్వీసులను అందిస్తోంది. ఎస్బీఐలో ఇప్పటివరకు అకౌంట్ లేనివాళ్లు ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను సులభంగా ఓపెన్ చేయవచ్చు. బ్యాంక్ కు కూడా వెళ్లకుండా అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. Also Read: కరోనా రెండో వేవ్ పై ప్రధాని మోడీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 18, 2021 / 05:22 PM IST
    Follow us on

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఇండియా 40 కోట్ల కంటే ఎక్కువ సంఖ్యలో కస్టమర్లను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎస్బీఐ ఎన్నో సర్వీసులను అందిస్తోంది. ఎస్బీఐలో ఇప్పటివరకు అకౌంట్ లేనివాళ్లు ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను సులభంగా ఓపెన్ చేయవచ్చు. బ్యాంక్ కు కూడా వెళ్లకుండా అకౌంట్ ను ఓపెన్ చేసే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది.

    Also Read: కరోనా రెండో వేవ్ పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

    ఎస్‌బీఐ ఇన్‌స్టా బ్యాంక్ అకౌంట్ సేవల పేరుతో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తుండగా కేవలం 5 నిమిషాల్లోనే ఈ బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. రోజులో 24 గంటలు ఈ సర్వీసులు అందుబాటులో ఉండటం వల్ల ఏ సమయంలోనైనా అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఎస్బీఐ యోనో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని కూడా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.

    Also Read: కమ్మని సాంబారులా పళని పాలన

    ఎవరైతే ఈ విధంగా ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ను ఓపెన్ చేస్తారో వాళ్లు సులభంగా రూపే ఏటీఎం డెబిట్ కార్డును పొందవచ్చు. బ్యాంక్ ఖాతాలలో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఈ అకౌంట్లను సులభంగా ఓపెన్ చేయవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఎస్బీఐలో సులభంగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది.

    మరిన్ని వార్తల కోసం: అత్యంత ప్రజాదరణ (ట్రెండింగ్)

    బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసిన సంవత్సరం లోపు సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి కైవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టేట్ బ్యాంక్ లో ఖాతా లేని వాళ్లు ఈ విధంగా సులభంగా అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.