https://oktelugu.com/

విరాటపర్వం టీజర్ టాక్: కామ్రేడ్ కోసం వెళ్లే యువతి ప్రేమ కథ

మెగా స్టార్ చిరంజీవి చేతులు మీదుగా.. హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ మూవీ టీజర్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ చిత్రం.. ఒక మావోయిస్టు యోధుడి జీవిత కథ ఆధారంగా తీసుకున్నట్టు సమాచారం. భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. ఈ కవిత్వానికి ఆకర్షితురాలైన సాయి పల్లవి అతడిని వెతుక్కుంటూ అన్నీ వదిలేసి బయలుదేరుతుంది. ఈ క్రమంలోనే ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? రానా కామ్రెడ్ గా ఎందుకు మారాడు? […]

Written By: , Updated On : March 18, 2021 / 05:23 PM IST
Follow us on

మెగా స్టార్ చిరంజీవి చేతులు మీదుగా.. హీరో రానా, హీరోయిన్ సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’ మూవీ టీజర్ విడుదలైంది. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ చిత్రం.. ఒక మావోయిస్టు యోధుడి జీవిత కథ ఆధారంగా తీసుకున్నట్టు సమాచారం.

భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. ఈ కవిత్వానికి ఆకర్షితురాలైన సాయి పల్లవి అతడిని వెతుక్కుంటూ అన్నీ వదిలేసి బయలుదేరుతుంది. ఈ క్రమంలోనే ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? రానా కామ్రెడ్ గా ఎందుకు మారాడు? అన్నది కథ..

టీజర్ చూస్తే రానా కవిత్వం చెప్పిన తీరు.. సాయి పల్లవి సంభాషణలు చాలా బాగున్నాయి. అంచనాలు పెంచేలా టీజర్ ఉంది. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్నగా రానా ఒక నక్సలైట్ పాత్రను పోషించారు. దట్టమైన అడవి.. అందులో రానా, నక్సలైట్లు, రోమాలు నిక్కబొడిచేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక్క డైలాగ్ లేకుండా కేవలం మావోయిస్టుల నాటి సంఘటనలతో సినిమాను నింపినట్టు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది.

తమకు జరిగిన అన్యాయంపై బదులు తీర్చుకునే ఒక వ్యక్తి నక్సలైట్ గా మారి అజ్ఞాతవాసంలో తన ప్రత్యర్థులను చంపినట్టు తెలుస్తోంది.

వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ బాబు సమర్పిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరిరావు, సాయి చంద్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Virata Parvam​ Teaser | Rana Daggubati, Sai Pallavi, Priyamani | Venu Udugula | Suresh Bobbili