ఫ్రైడే వార్ః బాక్సాఫీస్ బరిలో ఆ నలుగురు!

టాలీవుడ్లో ఈ శుక్ర‌వారం (మార్చి 19) నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో మంచు విష్ణు ‘మోసగాళ్లు’, కార్తికేయ ‘చావుకబురు చల్లగా’, ఆది సాయికుమార్ ‘శశి’తోపాటు ‘ఈ చిత్రంలో పాత్రలు కల్పితం’ అనే సినిమా కూడా ఉంది. మరి, ఇందులో ఏ సినిమా స‌త్తా చాటుతుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఇందులో విష్ణుకు అర్జెంటుగా ఓ హిట్ కావాల్సిన ప‌రిస్థితి. కెరీర్లో ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలు త‌ప్ప‌గా పెద్ద‌గా స‌క్సెస్ లు క‌నిపించ‌వు. ఫెయిల్యూర్స్ కు […]

Written By: Bhaskar, Updated On : March 18, 2021 4:50 pm
Follow us on


టాలీవుడ్లో ఈ శుక్ర‌వారం (మార్చి 19) నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో మంచు విష్ణు ‘మోసగాళ్లు’, కార్తికేయ ‘చావుకబురు చల్లగా’, ఆది సాయికుమార్ ‘శశి’తోపాటు ‘ఈ చిత్రంలో పాత్రలు కల్పితం’ అనే సినిమా కూడా ఉంది. మరి, ఇందులో ఏ సినిమా స‌త్తా చాటుతుంది అనేది ఆస‌క్తిగా మారింది.

ఇందులో విష్ణుకు అర్జెంటుగా ఓ హిట్ కావాల్సిన ప‌రిస్థితి. కెరీర్లో ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలు త‌ప్ప‌గా పెద్ద‌గా స‌క్సెస్ లు క‌నిపించ‌వు. ఫెయిల్యూర్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి, స‌క్సెస్ జ‌ర్నీ స్టార్ట్ చేయాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అనుకుంటున్నా.. అది సాధ్యం కావ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ ఇంట్ర‌స్టింగ్ స‌బ్జెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు విష్ణు. బ్యాంకు మోసం నేప‌థ్యంలో ‘మోసగాళ్లు’ అనే చిత్రం చేశాడు విష్ణు. ఇందులో కాజ‌ల్ విష్ణు సోద‌రిగా న‌టించ‌డంతో మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

ఇక మ‌రో హీరో కార్తికేయ గురించి చూస్తే.. మొద‌టి చిత్రం ‘ఆర్ఎక్స్‌100’ సూపర్ హిట్ కొట్టి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. అయితే.. ఆ త‌ర్వాత మ‌రో విజ‌యం ద‌క్క‌లేదు. ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ స‌క్సెస్ మాత్రం రిపీట్ కాలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘చావుక‌బురు చ‌ల్ల‌గా’ అంటూ మరో చిత్రంతో రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి మంచి ప్ర‌మోష‌న్ ల‌భించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచిగానే జ‌రుగుతున్నాయి.

శుక్ర‌వారం రాబోతున్న మ‌రో హీరో ఆది సాయికుమార్‌. తొలిచిత్రం ‘ప్రేమ కావాలి’, ఆ తర్వాత వచ్చిన ‘లవ్ లీ’ మూవీతో యూత్ ను ఆకట్టుకున్న ఆదికి.. ఆ తర్వాత చెప్పుకోదగిన సినిమానే పడలేదు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. సక్సెస్ వరించలేదు. దీంతో.. ఇ‌ప్పుడు ‘శశి’ అనే చిత్రంతో అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. ఈ మూవీ విజ‌యం త‌న కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ కావ‌డంతో.. దీనిపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్నాడు ఆది.

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే చిన్న సినిమా కూడా రాబోతోంది. అభిరామ్.ఎం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటించారు. మెగా బ్రదర్ నాగబాబు టీజర్ రిలీజ్ చేయగా.. దర్శకుడు పూరీ ట్రైలర్ విడుదల చేయ‌డంతో ఆస‌క్తి నెల‌కొంది. మ‌రి, ఈ నాలుగు చిత్రాల్లో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాగా ఏది నిలుస్తుందో చూడాలి.