
ఈ మధ్య కాలంలో రైల్వే శాఖ దేశంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ నిరుద్యోగులకు మేలు చేకూరుస్తోంది. తాజాగా రైల్వే శాఖ ఉత్తర మధ్య రైల్వేలోని వేర్వేరు విభాగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 480 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్, వెల్డర్, ఫిట్టర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. పదో తరగతితో పాటు ఐటీఐ చదివి ఉంటే ఐటీఐ అదనపు అర్హతగా పరిగణింపబడుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన అభ్యర్థులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులను నేరుగా అధికారులు ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అధికారులు ట్రైనింగ్ కు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 70 రూపాయలు కాగా మిగిలిన వారికి 170 రూపాయలుగా ఉంది.
https://ncr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా 480 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి.