https://oktelugu.com/

ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్కూటర్.. ఖరీదెంతంటే..?

దేశంలో సంవత్సరం సంవత్సరానికి వ్యక్తిగత వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది కొత్త వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే స్కూటర్, బైక్ ధరలు అంచనాలను మించి ఉండటంతో కొంతమంది ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. అయితే తక్కువ ధరతో కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు డీటెల్ కంపెనీ శుభవార్త చెప్పింది. కేవలం 39,999 రూపాయలకే కొత్త స్కూటర్ కొనుగోలు చేసే అవకాశాన్ని డీటెల్ కల్పిస్తోంది. ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 21, 2021 / 01:03 PM IST
    Follow us on

    దేశంలో సంవత్సరం సంవత్సరానికి వ్యక్తిగత వాహనాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది కొత్త వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. అయితే స్కూటర్, బైక్ ధరలు అంచనాలను మించి ఉండటంతో కొంతమంది ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. అయితే తక్కువ ధరతో కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు డీటెల్ కంపెనీ శుభవార్త చెప్పింది. కేవలం 39,999 రూపాయలకే కొత్త స్కూటర్ కొనుగోలు చేసే అవకాశాన్ని డీటెల్ కల్పిస్తోంది.

    ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో ఈ స్కూటర్ ను వాడేందుకు పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. ఆన్ లైన్ లో 2,000 రూపాయల టోకెన్ మొత్తాన్ని చెల్లించి ఈ స్కూటర్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ పెర్ల్ వైట్ కలర్, మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ రెడ్, మెటాలిక్ ఎల్లో, గన్‌మెటల్ కలర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. మొత్తం 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ లో నచ్చిన కలర్ ను ఎంపిక చేసుకోవచ్చు.

    డీటెల్ ఈసీ ప్లస్ స్కూటర్ లోడ్ సామర్థ్యం 170 కిలోలు కాగా ఈ స్కూటర్ ను ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు. ఈ స్కూటర్ ను కొనుగోలు చేసిన వాళ్లకు ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీ మరియు ఫ్రీ హెల్మెట్ లభిస్తుంది. కంపెనీ ఈ స్కూటర్ కు 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ ఇస్తుండగా 6 నుంచి 7 గంటల్లో ఈ స్కూటర్ ను సులభంగా ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది.

    డీటెల్ ఎలక్ట్రిక్ ప్లస్ స్కూటర్ 250 వాట్స్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉండగా 48v 12ah lifep04 బ్యాటరీతో ఈ స్కూటర్ పని చేస్తుంది. సంస్థ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ స్కూటర్ కోసం సులభంగా కొనుగోలు చేయవచ్చు.