spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan changing mind: జగన్ మనసు మారుతోందా?

Jagan changing mind: జగన్ మనసు మారుతోందా?

Jagan changing mind: రాజకీయాలు( politics) ఎప్పుడూ ఒకేలా ఉండవు.. పరిస్థితులకు తగ్గట్టు మారుతుంటాయి. అందుకు తగ్గట్టుగా నేతలు కూడా మారాలి. ఇప్పుడు జగన్ విషయంలో అదే పరిస్థితి ఎదురవుతోంది. ఏపీలో టీడీపీ కూటమిలో బిజెపి ఉంది. కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలో టిడిపి భాగస్వామిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో గతం మాదిరిగా తటస్థ వైఖరి ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి తాగదు. 2024 ఎన్నికలకు ముందు ఒకలా ఉంది. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జాతీయస్థాయిలో ఏదో ఒక కూటమి అండ జగన్మోహన్ రెడ్డికి అవసరం. మునుపటిలా ఒంటరి పోరాటం.. తటస్థ వైఖరి అనే మాట కుదరదు. అయితే ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడిప్పుడే అర్ధమైనట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇతర పార్టీల నేతలను.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసేందుకు ఎంత మాత్రం అంగీకరించేవారు కాదు. కానీ ఇప్పుడు పలకరింతలతో పాటు సన్నిహితంగా గడుపుతున్నారు వారితో. నిన్న తమిళనాడులో పదే పరిస్థితి కనిపించింది.

వివాహ వేడుకల్లో..
వైయస్ కుటుంబానికి చెందిన ఓ వివాహ వేడుక చెన్నైలో( Chennai) జరిగింది. ఆ వేడుకకు ముందుగానే హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఒక వివాహ వేడుకలో అంతలా గడపడం అరుదు. అయితే అది సొంత కుటుంబానికి చెందినది కావడంతోనే జగన్ అలా చేసి ఉండవచ్చు. కానీ అక్కడ గడిపిన క్షణాలు, ఆయనను కలిసిన నేతలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ వైఖరి మారినట్టు కనిపిస్తోంది. దాదాపు ఇండియా కూటమిలోని నేతలంతా జగన్మోహన్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్న కీలక నాయకుడిగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. ఆయన సైతం జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. కొత్త పార్టీ అధినేత విజయ్ సైతం వచ్చారు. ఆయన సైతం ఎన్డీఏ కు దూరంగా ఉన్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ జాతీయ నాయకుడు చిదంబరం సైతం వచ్చి కలిసారు. జగన్ తో కొంతసేపు భేటీ అయ్యారు. ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆలోచన మారుతున్నట్లు స్పష్టం అవుతోంది.

కెవిపి రామచంద్రరావు తో సైతం..
వైయస్ కుటుంబ కార్యక్రమం కావడంతో ఆయన ఆత్మగా భావించే కెవిపి రామచంద్రరావు( KVP Ramchandra Rao ) సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కుటుంబ సన్నిహితుడిగా భావించే కెవిపి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. ఆయనతో బాహాటంగా జగన్మోహన్ రెడ్డి గడిపిన సందర్భాలు లేవు. కానీ ఈ పెళ్లి వేడుకకు కెవిపి రామచంద్రరావు హాజరు కాగా.. హౌ ఆర్ యు అంకుల్ అంటూ పలకరించారు జగన్. ఒకవైపు వారంలో నాలుగు రోజులపాటు బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీలైనంత వరకు రాజకీయ ప్రశాంతత అక్కడ లభిస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు చెన్నైలో సైతం కాంగ్రెస్ తో పాటు కూటమి పార్టీల నేతలు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం, సన్నిహితంగా మెలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏదో జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Oktelugu Epaper
Exit mobile version