https://oktelugu.com/

కేటీఆర్ టీంలో పొంగులేటి.. కీలక పదవి ఖాయం..?

కేటీఆర్ సీం అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆయన టీంలోకి వస్తారని సమాచారం. దీనికి సంబంధించి యువనేత నుంచి స్పష్టమైన హామీ దక్కినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నేతల మధ్య విభేదాలు తొలగించి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన మంత్రి.. ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు కూడా సమాచారం. ఎవరినీ తక్కువ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 24, 2021 / 12:04 PM IST
    Follow us on


    కేటీఆర్ సీం అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆయన టీంలోకి వస్తారని సమాచారం. దీనికి సంబంధించి యువనేత నుంచి స్పష్టమైన హామీ దక్కినట్లు సమాచారం. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ వర్గపోరు నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో నేతల మధ్య విభేదాలు తొలగించి.. అందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాకు చెందిన మంత్రి.. ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు కూడా సమాచారం. ఎవరినీ తక్కువ చేసి చూడొద్దని.. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలకు కేటీఆర్ క్లాస్ తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ భేటీ అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో గంటకు పైగా చర్చించినట్లు తెలిసింది. దీంతో తనకు మంచి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

    Also Read: కేటీఆర్ ‘దక్షిణాది‘ జపం

    త్వరలో కేటీఆర్ కు పట్టాభిషేకం చేయనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కేబినెట్లో భారీగానే మార్పులు చోటు చేసుకుంటాని ఊహాగాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ సీఎం అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఆయన మంత్రి వర్గంలో చోటు దక్కొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ మేరకు పొంగులేటితో దాదాపు రెంటు గంటల పాటు కేటీఆర్ భేటీ అయినట్లు సమాచారం. పొంగులేటి అనుచరులైన పాయం వెంకటేశ్వర్లు.. తెల్లం వెంకట్రావుతో పాటు మిగితా వారి భవితకూ యవనేత పూర్తి హామీ ఇచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి తుమ్మల తోనూ కేటీఆర్ ఏకాంతంగా భేటీ అయ్యారు. ఆయనకు కూడా రాష్ట్రస్థాయిలో పదవి లభించే అవకాశాలు ఉన్నాయని తుమ్మల అనుచర వర్గం మాట్లాడుకుంటుంది.

    Also Read: మాట వినని నిమ్మగడ్డ.. రంగంలోకి పోలీసులు?

    ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మంత్రులు సీఎంగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని జోరుగా స్పందించారు. యువనేతకు మద్ధతు తెలిపారు. ఇటు ఖమ్మం జిల్లా నేతలు కూడా కేటీఆర్ కే తమ ఫుల్ సపోర్టు ఉంటుందని తేల్చి చెప్పారు. కేటీఆర్ తో చర్చల అనంతరం అయినా.. ఖమ్మం టీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో.. విభేదాలకు చెక్ పడుతుందా..? అని జిల్లా గులాబీ సైతం అశాభావం వ్యక్తం చేస్తుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్