Also Read: రైతుల ఆందోళనలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం..!
భారత్ బంద్ తో కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వరుసగా నోటీసులు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన 25మంది ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎమ్మెల్యేలు బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
2014 ఎన్నికల అఫిడవిట్ కు 2018 ముందస్తు ఎన్నికల సమయానికి అభ్యర్థులు సమర్పించిన ఆదాయంలో భారీగా తేడాలుండటాన్ని ఐటీ శాఖ గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో పెద్దమొత్తంలో ఆదాయం ఎలా పెరిగిందో చెప్పాలని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
2014.. 2018 అఫిడవిట్‌లో అభ్యర్థులు పేర్కొన్న గణాంకాలే ఐటీ అధికారులు ఐటీ నోటీసులు పంపడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నాలుగేళ్లలో 10శాతానికి పైగా ఎక్కువ సంపదను చూపినవారికే ఈ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కాగా నాలుగేళ్లలో సీఎం కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ తోసహా పలువురు ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగాయి.
Also Read: చావుదెబ్బ తిన్నా కాంగ్రెస్ మారదా?.. అప్పటి వరకు ఉత్తమే టీపీసీసీ చీఫ్..!
దీంతో ఐటీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు ఎవరెవరా? అనే ఆసక్తి నెలకొంది. ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చిన విషయాన్ని ఎమ్మెల్యేలు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఐటీ శాఖ సైతం నోటీసులు ఎవరెవరెకీ జారీ చేసింది అనేది అధికారికంగా వెల్లడించడం లేదు.
కేసీఆర్ కేంద్రంతో పోరుకు సిద్ధమైన తరుణంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోటీసులు జారీ అయ్యాయా? లేక ఐటీ అధికారుల రోటీన్ చెకప్ లో భాగంగా నోటీసులు జారీ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మున్మందు ఈ ఐటీ నోటీసుల వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిని రేపుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్