మద్యం తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ తీసుకుంటే తాగకూడదట..?

గడిచిన పది నెలలుగా ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. వైరస్ విజృంభించి చాలా నెలలైనా నేటికీ వైరస్ కు సంబంధించిన కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తూ ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. గతంతో పోలిస్తే దేశంలో కేసుల సంఖ్య తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. Also Read: భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. ఒక గుడ్డు ఎంతంటే..? అయితే వ్యాక్సిన్ గురించి […]

Written By: Navya, Updated On : December 10, 2020 5:57 pm
Follow us on


గడిచిన పది నెలలుగా ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి. వైరస్ విజృంభించి చాలా నెలలైనా నేటికీ వైరస్ కు సంబంధించిన కొత్త లక్షణాలు వెలుగులోకి వస్తూ ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. గతంతో పోలిస్తే దేశంలో కేసుల సంఖ్య తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. ఒక గుడ్డు ఎంతంటే..?

అయితే వ్యాక్సిన్ గురించి వెలువడుతున్న వార్తలు త్వరలోనే కరోనా వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమేననే నమ్మకాన్ని ప్రజలకు కలిగిస్తున్నాయి. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే మద్యం తాగేవాళ్లు మాత్రం కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే దాదాపు 60 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రష్యాలో ఇప్పటికే అధికారులు ఆ దేశ పౌరులు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.

Also Read: రాత్రి భోజనం తరువాత అరటిపండు తినవచ్చా..? తినకూడదా..?

మద్యం తీసుకుంటే వ్యాక్సిన్ సరిగ్గా పని చేసే అవకాశాలు ఉండవని.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మద్యం తాగితే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మద్యపాన ప్రియులకు ఈ వార్త చేదువార్తే అయినా ఆరోగ్యం దృష్ట్యా మందుబాబులు మద్యానికి దూరంగా ఉంటే మంచిది. వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా పని చేయాలంటే మందుబాబులు మద్యానికి దూరం కావాల్సిందేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం: ఆరోగ్యం/జీవనం

మరోవైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రాధాన్యత ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నాయి. ఒకటికి మించిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనాకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.