https://oktelugu.com/

భారీగా తగ్గిన గుడ్ల ధరలు.. ఒక గుడ్డు ఎంతంటే..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా గుడ్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఒక గుడ్డు 5 రూపాయలు పలకగా తర్వాత రోజుల్లో ధరలు పెరిగి 6.00 రూపాయలు పలికింది. అయితే ఎట్టకేలకు గుడ్ల ధరలు దిగివచ్చాయి. కార్తీక మాసం వల్ల గుడ్ల వినియోగం భారీగా తగ్గడంతో గుడ్డు ధర ఏకంగా రూ 3.90కు పతనం కావడం గమనార్హం. కార్తీక మాసం ఎఫెక్ట్ వల్ల చికెన్ ధరలు సైతం తగ్గాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2020 / 09:43 AM IST
    Follow us on


    దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా గుడ్ల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు నెలల క్రితం ఒక గుడ్డు 5 రూపాయలు పలకగా తర్వాత రోజుల్లో ధరలు పెరిగి 6.00 రూపాయలు పలికింది. అయితే ఎట్టకేలకు గుడ్ల ధరలు దిగివచ్చాయి. కార్తీక మాసం వల్ల గుడ్ల వినియోగం భారీగా తగ్గడంతో గుడ్డు ధర ఏకంగా రూ 3.90కు పతనం కావడం గమనార్హం. కార్తీక మాసం ఎఫెక్ట్ వల్ల చికెన్ ధరలు సైతం తగ్గాయి.

    Also Read: టీవీ, ఫ్రిజ్ కొనాలనుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్..?

    కార్తీకమాసం పూజలు చేసేవాళ్లు ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు. కార్తీకమాసంలో చాలామంది మాంసంతో పాటు గుడ్డు కూడా తినడానికి ఆసక్తి చూపరు. ఫలితంగా గుడ్ల ధరలు భారీగా తగ్గాయి. డిమాండ్ తగ్గుతుండటంతో గుడ్ల ధరలు తగ్గగా కోళ్ల పెంపకం దారులు మాత్రం డిమాండ్ తగ్గడంతో తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. నెల రోజుల క్రితం వరకు ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు ఎక్కువగా ఉండగా ప్రస్తుతం ఎగుమతులు కూడా తగ్గుముఖం పట్టాయి.

    Also Read: 2020 కంటే దారుణంగా 2021.. డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర హెచ్చరికలు..?

    కోళ్ల పెంపకందారులు రోజురోజుకు కోళ్ల పెంపకానికి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని.. ఖర్చులు పెరుగుతున్న స్థాయిలో ఆదాయం మాత్రం పెరగడం లేదని చెబుతున్నారు. చలికాలం కావడంతో కోళ్లకు కృత్రిమ వేడి కోసం విద్యుత్ వినియోగం పెరిగిందని.. గుడ్ల ఉత్పత్తి మాత్రం గతంతో పోలిస్తే 5 శాతం వరకు తగ్గిందని చెబుతున్నారు. దాదాపు రెండు రూపాయలు గుడ్డు ధర తగ్గడంతో కోళ్ల పెంపకం లాభసాటిగా లేదని వ్యాపారులు వాపోతున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    మరోవైపు ప్రాంతాన్ని బట్టి చికెన్ ధరల్లో సైతం మార్పులు ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకు 200 రూపాయలకు పైగా కిలో చికెన్ పలకగా ప్రస్తుతం 140 నుంచి 200 రూపాయల లోపే కిలో చికెన్ లభ్యమవుతోంది. రోజురోజుకు ధరలు తగ్గడం వ్యాపారులను టెన్షన్ పెడుతోంది.