భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యుడుగా ఉన్న మహాత్మగాంధీ ఎలా చనిపోయారంటే.. నాథూరాం గాడ్సే హత్య చేశారని చరిత్ర చెబుతోంది. 1948 జనవరి 30న మహాత్మ హత్య చేయబడ్డాడు. ఈ హత్యను నాథూరాం గాడ్సే ఒక్కరే చేశారని అందరికీ తెలిసిన విషయం. కానీ గాంధీ హత్యకు పది రోజుల ముందే పెద్ద ప్లాన్ వేశారని ఇటీవల బయటకొస్తున్న విషయం. అంతేకాకుండా గాంధీని నాథూరాం గాడ్సే ఒక్కరే హత్య చేయలేదని, మరో ఇద్దరు నారాయణ ఆప్టే, విష్ణు కర్కరేలు గాంధీ హత్యలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాంధీని హత్య చేయడానికి పాకిస్థాన్ గా విడిపోయిన దేశానికి రూ.55 కోట్ల పంపకాల్లో తేడా రావడమే కారణమైందా..? అనే చర్చ సాగుతోంది. మహాత్మగాంధీ మునిమనువడు తుషార్ గాంధీ రాసిన ‘లెట్స్ కిల్ గాంధీ’అనే పుస్తకం రాశారు. అందులోని విషయాల ప్రకారం..
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948 జనవరి 13న మహాత్మగాంధీ నిరాహార దీక్ష చేశారు. రెండు విషయాలను తేల్చాలని గాంధీ నిరాహార దీక్ష చేపట్టారు. ఒకటి పాకిస్థాన్ కు రూ.55 కోట్లు ఇవ్వాలి. రెండు ఢిల్లీలోని ముస్లింల ఇళ్లపై దాడులు ఆపాలి. అయితే రూ.55 కోట్లు పాకిస్థాన్ కు ఎందుకివ్వాలి..? ఆ విషయం ఏంటని పరిశీలిస్తే..
భారత్, పాకిస్థాన్ విడిపోయిన తరువాత రూ.75 కోట్లు పాకిస్థాన్ కు ఇవ్వాలని విభజన ఒప్పందం జరిగింది. ఇందులో రూ.20 కోట్లు పాకిస్థాన్ కు ఇచ్చారు. మిగతా రూ.55 కోట్లు పాకిస్థాన్ ప్రభుత్వం అడుగుతోంది. ఈ తరుణంలో బాపూజీ ‘పాకిస్థాన్ కు ఇచ్చిన మాట తప్పకూడదు.. అలా జరిగితే ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని గాంధీ అన్నారు’ అని ఆయన ముని మనువడు తుషార్ గాంధీ తెలిపారు. అయితే గాంధీ డిమాండ్ కు దిగొచ్చిన ప్రభుత్వం రూ.55 కోట్లు పాకిస్థాన్ కు ఇస్తానని ఒప్పుకుంది. కానీ ఈ నిర్ణయంపై అతివాద హిందువులు ఆగ్రహంతో ఊగిపోయారు. వారి దృష్టిలో గాంధీ విలన్ అయిపోయారు.
ఆ సమయంలో హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ సైతం రూ.55 కోట్లు పాకిస్థాన్ కు ఇవ్వడంపై కాస్త అసహనంగానే ఉన్నారు. ‘పాకిస్థాన్ కు రూ.55 కోట్లు ఇవ్వాలన్న విషయంపై నాన్న ఏకీభవించలేదన్న విషయం నాకు గుర్తుంది.. పాకిస్థాన్ తో జరిగిన చర్చల తరువాతే ఈ మొత్తాన్ని ఇవ్వాలని నాన్న చెప్పారు’ అని కపూర్ కమిషన్ తో పటేల్ కూతురు మణిబెన్ చెప్పారు. తుషార్ గాంధీ మాత్రం ‘గాంధీ వాదన కన్నాపటేల్ ప్రజల సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఇచ్చారని’ చెప్పారు.
ఇక 1948 జనవరి 18న ఒక శాంతి కమిటి సమావేశమైంది. మహరౌలీలో సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకీ ఉర్సును ప్రతి ఏటా లాగే నిర్వహిస్తామని, ముస్లింలు ఢిల్లీలోని తమ ఇళ్లలోకి వెళ్లవచ్చని, హిందువుల ఆక్రమణ నుంచి మసీదులను విడిపిస్తామని ఈ శాంతి కమిటి గాంధీకి హామి ఇచ్చింది. దీంతో అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీజీ నిరాహార దీక్ష విరమించారు. అయితే ఆ తరువాత హిందూ కమిటీ సమావేశమై ఈ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సమావేశంలో గాంధీజీని తిట్టడంతో పాటు ఆయనను నియంతగా పేర్కొన్నారు.
ఈ ఘటనే గాంధీ హత్యకు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 19న హిందూ మహాసభలో వారు సమావేశమయ్యారు. మహాత్మగాంధీ హత్యకు పూర్తిగా పథకం సిద్ధమైందని జడ్జికి సమర్పించిన పోలీసు రిపోర్టులో ఉంది. ఆరోజు మొత్తం ఏడుగురిలో ముగ్గురు నాథూరాం గాడ్సే, విష్ణు కర్కరే, నారాయణ్ ఆప్టే బిర్లా మందిర్ వైపు వెళ్లారు. ప్రార్థనా సభ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. అదే రోజు సాయంత్రం మళ్లీ అక్కడకు వెళ్లారు. రాత్రి మరోసారి సమావేశమయ్యారు.
జనవరి 20నే గాంధీని హత్య చేసేందుకు ప్లాన్ వేశారని గాంధీ మునిమనువడు తుషార్ గాంధీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆరోజు నాథూరం గాడ్సే అనారోగ్య కారణాల వలన బిర్లామందిర్ కు రాలేదు. మిగతా నలుగురు మాత్రం భవనం వెనకున్న అడవిలో రివాల్వర్ ను పరీక్షించారు. తరువాత మరోసారి హోటల్లో కలుసుకొని ప్లాన్ వేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బిర్లాభనవ్ పై మదన్ లాల్ పాహ్వా బాంబు విసిరారు. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయనను అరెస్టు చేశారు. కానీ బాంబు విసరడంతో దిగంబర్ బడ్గే కాల్పులు జరపాలన్నది ప్లాన్ కానీ ఆ అవకాశం రాలేదు. ఎందుకంటే బాంబు విసరగానే గాంధీ అందరినీ నచ్చజెప్పి కూర్చొబెట్టారు.
కొన్ని రోజుల విరామం తరువాత జనవరి 27న గాడ్సే, ఆప్టే బాంబే నుంచి బయలుదేరారు. 29న ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ కర్కరేను కలుసుకున్నారు. జనవరి 30న వారు బిర్లా మందరి వెనుక అడవిలో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. సాయంత్రం 5 గంటలకు నాథూరాం గాడ్సే బాపూజీని కాల్చి చంపారు. అయితే వెంటనే నాథూరాం గాడ్సే అరెస్టయ్యారు. కానీ ఆప్టే, కర్కరే మాత్రం అక్కిడి నుంచి పారిపోయారు. ఆ తరువాత ఇద్దరు ఫిబ్రవరి 14న అరెస్టయ్యారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: New angle in gandhijis assassination is that why mahatma was killed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com