
కరోనా కొత్త స్ట్రెయిన్ ఆ దేశాల పాలిట శాపంగా మారుతోంది. వేడి దేశాలైన భారత్ లో కరోనా ప్రభావం తగ్గిన శీతల దేశాలైన యూరప్ దేశాలను కరోనా మరోసారి భయపెడుతోంది. అక్కడి ప్రజలను మరణానికి దగ్గర చేస్తోంది. అందుకే ఇప్పుడు కొన్ని దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించాయి.
Also Read: ఆఖరి రోజుల్లోనూ ట్రంప్ కీలక నిర్ణయం
కరోనా మహమ్మారి ముగిసిందనే లోపే బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా అక్కడ తీవ్రంగా బలం పుంజుకొని లక్షలమందికి సోకుతూ వేల మంది ప్రాణాలు తీస్తోంది. దీంతో దెబ్బకు ఆదేశ ప్రధాని జాన్సన్ బ్రిటన్ లో లాక్ డౌన్ విధించాడు.బ్రిటన్ తోపాటు ఉన్న యూరప్ దేశాలను కూడా కరోనా మహమ్మారి ఆవహించింది. దీంతో దేశాధినేతలంతా తలలు పట్టుకుంటున్నారు.
సాధారణ కరోనా వైరస్ కంటే ఈ స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతుండగా.. మరణాలు అంతకంతకూ పెరిగిపోతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది.
కొత్త కరోనా స్ట్రెయిన్ తో ఇప్పటికే ఇంగ్లండ్ దేశం పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించగా తాజాగా తీవ్రత ఎక్కువగా పక్కనున్న యూరప్ దేశాలైన జర్మనీ, స్కాట్లాండ్ దేశాలు అదే బాటలో నడుస్తున్నాయి.
Also Read: కరోనా వ్యాక్సిన్‌పై ఆసక్తి చూపని ఇండియన్స్
బ్రిటన్ లో ప్రజలంతా ఫిబ్రవరి వరకు ఇంటికే పరిమితం కావాలని.. కఠినమైన లాక్ డౌన్ తప్పదని ఆ దేశ ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చాడు. కేసులు, మరణాలు పెరుగుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక జర్మనీలోనూ కరోనా వైరస్ కేసుల తీవ్రత దృష్ట్యా డిసెంబర్ 16న లాక్ డౌన్ విధించగా.. తాజాగా జనవరి 10 వరకు పొడిగించారు.
తాజాగా ఇదే బాటలో స్కాట్లాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, పోలండ్ దేశాలు లాక్ డౌన్ విధించేందుకు నిర్ణయించాయి. జనవరి నెలాఖరు వరకు ఈ దేశాలు లాక్ డౌన్ ను పొడిగించాయి.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు