ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు.. వైరిపక్షం మీడియా ఆగమాగం చేస్తోంది. రోజుకొకటి చొప్పున జరుగుతున్న ఆలయాలపై దాడులు జగన్ సర్కార్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విగ్రహాలు ధ్వంసం కావడం.. అక్కడి ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు వాలిపోవడం.. విద్వేషాలు రెచ్చగొడుతున్న వైనంపై జగన్ సర్కార్ సీరియస్ గా ఉంది.
Also Read: తిరుమల, తలనీలాలు.. ఓ చంద్రబాబు..
ఏపీలో దేవాలయాలపై దాడులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. మతాలు, కులాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టేలా ఏపీలో ఈ ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ ఎన్ని మంచి పథకాలు పెట్టినా.. ఇళ్ల స్థలాలు ప్రారంభించినా ఆ క్రెడిట్ ఆయనకు దక్కకుండా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాజకీయ దురుద్దేశాలతోనే అర్ధరాత్రి ఆలయాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తుంటే వాటిని జీర్ణించుకోలేకే దొంగ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని..దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్నారు.
Also Read: సెలవులంటే ఆ అధికారికి భయం పట్టుకుంది
ఈ క్రమంలోనే సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేస్తూ మత విద్వేశాలు రెచ్చగొడుతున్న వ్యక్తులు భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. మతాలు, కులాల మధ్య ద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని.. ఈ విషయంలో ఎవరినీ లెక్కచేయవద్దని సీఎం ఆదేశించారు.
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విగ్రహ విధ్వంసకుల వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. విగ్రహాలు ధ్వంసం చేయడానికే భయపడేలా పోలీస్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్