https://oktelugu.com/

రావి చెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలలో కేవలం గుడులు, గోపురాలకు మాత్రమే కాకుండా వృక్షాలకు సైతం ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. కొన్ని వృక్షాలను దేవతా వృక్షాలు గా భావించి వాటికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ విధంగా దేవతా వృక్షాలు పూజించటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. అలాంటి దేవత వృక్షాలలో ఒకటైన రావిచెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం… Also Read: మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2021 / 06:59 AM IST
    Follow us on

    మన హిందూ సాంప్రదాయాలలో కేవలం గుడులు, గోపురాలకు మాత్రమే కాకుండా వృక్షాలకు సైతం ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. కొన్ని వృక్షాలను దేవతా వృక్షాలు గా భావించి వాటికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ విధంగా దేవతా వృక్షాలు పూజించటం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. అలాంటి దేవత వృక్షాలలో ఒకటైన రావిచెట్టుకు పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

    Also Read: మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?

    భవిష్య పురాణం ప్రకారం కొడుకుని కనడం కన్నా, బాటలో వృక్షాన్ని పెంచడం మిన్న అని భవిష్య పురాణం చెబుతుంది. అలాంటి వృక్షాలలో రావి చెట్టు ఎంతో పరమ పవిత్రమైనది అని సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలో తెలియజేశాడు. ఎంతో పవిత్రంగా భావించే ఈ రావిచెట్టును సాక్షాత్తు ఆ విష్ణుభగవానుడు నిలయంగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రావిచెట్టును అశ్వత్థ వృక్షంగా కూడా పరిగణిస్తారు.

    Also Read: ఈ ఏడాది మొత్తం నాలుగు గ్రహణాలు.. ఏయే తేదీల్లో వస్తాయంటే?

    ఇంతటి పవిత్రమైన రావిచెట్టు వేర్లలో విష్ణు భగవానుడు, చెట్టు కాండంలో శివుడు, చెట్టు కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, చెట్టు కాయలు సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణం తెలియజేస్తుంది. ఇంతమంది దేవతలు కొలువై ఉన్న రావి చెట్టును పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా సంతానం కోసం ఎదురుచూసేవారు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టి రావిచెట్టు కట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఏలినాటి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. రావి చెట్టుకింద నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం