https://oktelugu.com/

అలర్ట్.. అలర్ట్.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు.. మరోవైపు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు..!

కరోనాతో ప్రపంచం అతలాకుతులం అవుతోంది. ఈ వైరస్ ధాటికి అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. లాక్డౌన్ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో కేంద్రం మెల్కోని కరోనా నిబంధనలతో అన్నిరంగాలకు మినహాయింపు ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొచ్చింది. కరోనా ఆన్ లాక్ లో మొదటగా మద్యం షాపులకే కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాలోనూ మద్యం షాపులు తెరిచేందుకే నాడు మొగ్గుచూపాయి. లాక్డౌన్ దెబ్బతో కోల్పోయిన ఆదాయాన్ని మద్యం ద్వారా తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేశాయి. అనుకున్నట్లుగానే మద్యం వల్ల  […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 05:05 PM IST
    Follow us on

    కరోనాతో ప్రపంచం అతలాకుతులం అవుతోంది. ఈ వైరస్ ధాటికి అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. లాక్డౌన్ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో కేంద్రం మెల్కోని కరోనా నిబంధనలతో అన్నిరంగాలకు మినహాయింపు ఇచ్చి సాధారణ స్థితికి తీసుకొచ్చింది.

    కరోనా ఆన్ లాక్ లో మొదటగా మద్యం షాపులకే కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాలోనూ మద్యం షాపులు తెరిచేందుకే నాడు మొగ్గుచూపాయి. లాక్డౌన్ దెబ్బతో కోల్పోయిన ఆదాయాన్ని మద్యం ద్వారా తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేశాయి. అనుకున్నట్లుగానే మద్యం వల్ల  తెలుగు రాష్ట్రాలకు భారీగానే ఆదాయం సమకూరింది.

    తాజాగా కరోనా కొత్త వైరస్ ఎంట్రీతో అన్ని నగరాల్లో న్యూయర్ వేడుకలపై ఆయా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. తెలంగాణలోనూ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు కొనసాగుతాయని.. ప్రజలంతా ఎవరింట్లో వారు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని ప్రభుత్వం కోరింది.

    మరోవైపు డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇచ్చింది. బార్లు.. క్లబ్బులకు అర్ధరాత్రి ఒంటి వరకు అనుమతి ఇవ్వడం గమనార్హం. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెడుతూనే మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు.

    ఇదిలా ఉంటే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓవైపు అర్థరాత్రి మద్యం షాపులు తెరిచి విరివిరిగా ఆదాయం పెంచుకోనున్న సర్కార్.. మరోవైపు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులతోనూ ఆదాయం సమకూర్చుకోనుంది.

    దీంతో డిసెంబర్ 31న తెలంగాణకు భారీ ఆదాయం సమకూరడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే ప్రభుత్వం ఓవైపు మద్యంబాబులతో తాగించే కార్యక్రమం షూరు చేస్తూనే.. మరోవైపు పోలీసులతో కేసులు పెట్టించేందుకు సిద్ధమవుతుండటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.