కేటీఆర్ నోట.. జమిలి ఎన్నికలు..!

జమిలి ఎన్నికలపై గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా విస్కృత చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. బీహర్ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ జమిలి ఎన్నికలపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో కేంద్రం ఎప్పుడైనా జమిలి ఎన్నికలను వెళ్లేందుకు సిద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. Also Read: గ్రేటర్ ఎఫెక్ట్.. ఒక్కటవుతున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్..! కేంద్రంలో రెండోసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మోదీ పలుమార్లు జమిలి […]

Written By: Neelambaram, Updated On : December 7, 2020 10:46 am
Follow us on

జమిలి ఎన్నికలపై గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా విస్కృత చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ పలుసార్లు జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. బీహర్ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ జమిలి ఎన్నికలపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. దీంతో కేంద్రం ఎప్పుడైనా జమిలి ఎన్నికలను వెళ్లేందుకు సిద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.

Also Read: గ్రేటర్ ఎఫెక్ట్.. ఒక్కటవుతున్న కాంగ్రెస్.. టీఆర్ఎస్..!

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మోదీ పలుమార్లు జమిలి ఎన్నికలపై మాట్లాడారు. ఈక్రమంలో జమిలి ఎన్నికలకు కేంద్రం ముందడుగు వేస్తుందా? లేదా అనే ఆసక్తి ప్రతీఒక్కరిలో నెలకొంది. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ సైతం తాాజాగా జమిలి ఎన్నికలపై తాజాగా స్పందించారు.

గ్రేటర్ ఫలితాలపై ఆదివారం టీఆర్ఎస్ భవన్లో విస్కృతస్థాయి చర్చ జరుగుతోంది. ఈ సమీక్షలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు.. కార్పొరేటర్లు పాల్గొని గ్రేటర్ ఫలితాలపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేంద్రం జమిలి ఎన్నికల దిశగా వెళుతుందని చెప్పారు. ఏ క్షణమైన జమిలి ఎన్నికలు రావచ్చని శ్రేణులు అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.

Also Read: కాంగ్రెస్ లో చిచ్చుపెడుతున్న టీపీసీసీ.. తీరుమార్చుకోని నేతలు..!

కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా బంద్ ను పాటించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపొటములు సహజమని.. ఎప్పటిలాగే తెలంగాణలో అభివృద్ధి చేస్తూ ముందుకెళుతామని తెలిపారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై శ్రేణులు దృష్టిసారించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్