https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో హీరోయిన్ కి బెయిల్ !

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తికి, ఆమె తమ్ముడికి ఇప్పటికే బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కన్నడ నటీమణుల బెయిల్ పరిస్థితే ఇంకా అర్ధం కావడం లేదు. నిజానికి బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు, బెంగళూరు డ్రగ్స్ కేసుకు ఏ సంబంధం లేదనేది వాస్తవం. అయినా బెంగళూరు డ్రగ్స్ కూడా సీరియస్ గా సాగుతుంది. అయితే తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసు కూడా వీగిపోతుంది అని కన్నడ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి జైలు […]

Written By:
  • admin
  • , Updated On : December 6, 2020 / 06:04 PM IST
    Follow us on


    డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తికి, ఆమె తమ్ముడికి ఇప్పటికే బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కన్నడ నటీమణుల బెయిల్ పరిస్థితే ఇంకా అర్ధం కావడం లేదు. నిజానికి బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు, బెంగళూరు డ్రగ్స్ కేసుకు ఏ సంబంధం లేదనేది వాస్తవం. అయినా బెంగళూరు డ్రగ్స్ కూడా సీరియస్ గా సాగుతుంది. అయితే తాజాగా బెంగళూరు డ్రగ్స్ కేసు కూడా వీగిపోతుంది అని కన్నడ పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి జైలు జీవితం గడుపుతున్న సంజనకు ఈ సారి బెయిల్ రావొచ్చని అంటున్నారు.

    Also Read: ప్రభాస్ ను వివాదాల్లోకి నెట్టిన సైఫ్ అలీ ఖాన్ !

    పాపం సంజనాకు ఇప్పటికే రెండుసార్లు ఆమె బెయిల్ రిజెక్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ దొరకకపోవడానికి ప్రధాన కారణం శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో నటి సంజనా గల్రానీనే కీలక వ్యక్తి అట. ఆమె అసలైన వ్యక్తి కాబట్టే.. బెంగళూర్ క్రైమ్ పోలీసులు ఆమెను అంత తేలిగ్గా వదిలేదే లేదని వాదిస్తున్నారు. ఆమె అకౌంట్ నుంచి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు అధికారులు గుర్తించి.. ఇప్పటికే వాటి పై విచారణ కూడా చేస్తున్నారు. ఇంతగా ఎలా సంపాదించారు అని ఈడీ అడిగిన ప్రశ్నలకు సంజన నుండి సరైన సమాధానం లేదట.

    Also Read: మోనాల్ కోసం అవినాష్‌ బలి.. బిగ్ బాస్ పక్షపాత ధోరణి !

    సినిమాలు, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, యాడ్స్, ఫొటో షూట్స్ వాటి ద్వారా తానూ డబ్బులు సంపాధించానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఆమె డ్రగ్స్ వ్యాపారంతోనే ఇంత సంపాదించింది అని పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ డ్రగ్స్ కేసులో మాత్రం బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల.. పోలీసుల వాదనని కోర్టులు పట్టించుకోవడం లేదు. అందుకే లేట్ గా ఐనా సంజనకు బెయిల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్