https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్యూ ద్వారా సెయిల్‌‌ లో ఉద్యోగాలు..?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దుర్గాపూర్ లో సెయిల్ లో 39 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జనవరి 9వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 6, 2020 / 05:27 PM IST
    Follow us on


    స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. దుర్గాపూర్ లో సెయిల్ లో 39 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మెడికల్ ఆఫీసర్లు, మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల 9వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జనవరి 9వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 85 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

    https://sail.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొవాల్సి ఉంటుంది. 39 ఉద్యోగ ఖాళీలలో 25 మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాలు కాగా 14 మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. డిసెంబర్ 5వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు dspintake@gmail.com ఈ మెయిల్ ఐడీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు..!

    ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఉద్యోగాలను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, బీడీఎస్‌, ఎండీ, పీజీ/ డీఎన్‌బీ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలు ఉంటాయి.

    మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం

    ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోటీ భారీగానే ఉంటుందని సమాచారం. ఉద్యోగంలో చేరిన తర్వాత అనుభవాన్ని బట్టి వేతన పెంపు అమలవుతుంది.