Site icon OkTelugu

Venu Swamy Controversial Comments On Vijay Divorce: హీరో విజయ్ విడాకుల వ్యవహారం గురించి వేణు స్వామి సంచలన కామెంట్స్.. మళ్ళీ మొదలెట్టాడు!

Venu Swamy Controversial Comments On Vijay Divorce

Venu Swamy Controversial Comments On Vijay Divorce

Venu Swamy Controversial Comments On Vijay Divorce: ఈ ప్రపంచం లో ఎక్కడ ఏది జరిగినా కూడా, తానూ ముందే ఈ విషయాన్నీ గ్రహించి జ్యోతిష్యం చెప్పాను అని చెప్పుకొచ్చే వేణు స్వామి గురించి తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు. కొత్తగా పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీల గురించి ఇతని నోటి నుండి ఒక్కసారి కూడా మంచి మాటలు రావడం జరగలేదు. రెండేళ్లలో విడిపోతారు , వీళ్ళ బంధం నిలబడదు అంటూ చెప్తూ ఉండేవాడు. నాగ చైతన్య , శోభిత శుభమా అంటూ పెళ్లి చేసుకొని వస్తే, వీళ్లిద్దరు 2027 వ సంవత్సరం లో విడిపోతారు అంటూ సంచలనం వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు కారణంగా ఎన్నో కేసులు కూడా పడ్డాయి. తీవ్రమైన ఇబ్బందులను కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి ఇలాంటి జాతకాలు చెప్పడం మానేసాడు వేణు స్వామి. కానీ ఆయన గతం లో చెప్పిన మాటలు నిజమైనప్పుడు మాత్రం , ఆ వీడియోలను షేర్ చేస్తూ నేను ముందే ఈ విషయాన్నీ చెప్పాను అంటూ చెప్తుంటాడు వేణు స్వామి.

Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్

అలా విజయ్ తన భార్య సంగీత తో విడాకులు తీసుకుంటాడని, గతం లోనే తాను చెప్పాను అంటూ అప్పట్లో ఆయన చేసిన వీడియో ని మరోసారి షేర్ చేసాడు. ఈ వీడియో లో ఏముందంటే ‘త్వరలోనే సౌత్ లోని ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తన భార్య తో విడాకుల సమస్య తో ఇబ్బంది పడుతాడు. ఆ సమయంలోనే అతను ఒక హీరోయిన్ తో పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి కూడా బయటపడుతుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు. వేణు స్వామి అప్పట్లో ఈ విషయం చెప్పకముందే, సోషల్ మీడియా లో విజయ్ త్రిష ప్రేమ వ్యవహారం గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉండేవి. వాటిని ఆధారంగా తీసుకొనే వేణు స్వామి అలా మాట్లాడి ఉంటాడు కానీ, ఆయనకు ఏ జాతకం తెలియదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

Exit mobile version