https://oktelugu.com/

కోమటిరెడ్డి ఆమరణ నిరాహార దీక్ష.. దేనికోసం?

టీపీసీసీ రేసులో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఓవైపు పీసీనీ దక్కించుకునేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతూనే మరోవైపు ప్రజా సమస్యలపై తన గళాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఈ విషయంపై తాజాగా కోమటిరెడ్డి స్పందించారు. సంక్రాంతి లోగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డెడ్ లైన్ విధించారు. ఈ గడువులోగా కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 28, 2020 / 06:26 PM IST
    Follow us on

    టీపీసీసీ రేసులో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఓవైపు పీసీనీ దక్కించుకునేందుకు అధిష్టానం వద్ద పావులు కదుపుతూనే మరోవైపు ప్రజా సమస్యలపై తన గళాన్ని బలంగా విన్పించే ప్రయత్నం చేస్తున్నారు.

    సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఈ విషయంపై తాజాగా కోమటిరెడ్డి స్పందించారు. సంక్రాంతి లోగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డెడ్ లైన్ విధించారు.

    ఈ గడువులోగా కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పై తన వైఖరిని మార్చుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. సీఎం కేేసీఆర్ ఆయన తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారనే ఎద్దేవా చేశారు.

    బీజేపీ నేతలు కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించడంతో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు వత్తాసు పలుకుతున్నారంటూ విమర్శించారు. రైతుల కోసం 8వేల కోట్లు ఖర్చు చేయలేరా? అంటూ నిలదీశారు.

    కాంగ్రెస్ గ్రామాల్లో తీసుకొచ్చిన కొనుగోలు కేంద్రాలను టీఆర్ఎస్ సర్కార్ ఎత్తివేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ ఒకసారి కేంద్రం చట్టాలకు వత్తాసు పలుకుతూ మరోసారి వ్యతిరేకంగా మాట్లాడుతూ ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు.