విరాట్ కోహ్లీ గొప్ప ఘనత.. దశాబ్ధపు మేటి క్రికెటర్

ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్ధపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ గొప్ప ఘనత సాధించాడు. ఏకంగా ఈ దశాబ్ధంలోనే నంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్ గా ఎంపికైన కోహ్లీ ‘సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఈ దశాబ్ధపు అత్యుత్తమ వన్డే ఆటగాడిగా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సత్తా చాటాడు. ఈ […]

Written By: NARESH, Updated On : December 28, 2020 5:49 pm
Follow us on

ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్ధపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత సారథి విరాట్ కోహ్లీ గొప్ప ఘనత సాధించాడు. ఏకంగా ఈ దశాబ్ధంలోనే నంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్ గా ఎంపికైన కోహ్లీ ‘సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్’ అవార్డు గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఈ దశాబ్ధపు అత్యుత్తమ వన్డే ఆటగాడిగా నిలిచాడు.

2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సత్తా చాటాడు. ఈ దశాబ్ధంలో 70 సెంచరీలు చేయడంతో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు.

ఇక మాజీ సారథి ఎంఎస్ ధోని సైతం ఈ దశాబ్ధపు ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డును గెలుచుకున్నారు. 2011లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఇయాన్ బెల్ రనౌట్ పై ధోని ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి ఈ అవార్డ్ దక్కింది.

ఇక ఐసీసీ టెస్టు అత్యుత్తమ ఆటగాడిగా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ గా నిలిచాడు. టీట్వంటీ ఫార్మాట్ లో ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ఖాన్ కు అత్యుత్తమ దశాబ్ధపు ఆటగాడు అవార్డు లభించింది. ఈ ఆటగాళ్లకు ఐసీసీ ఈ అవార్డులను ప్రధానం చేయనుంది.

Tags