ఇంగ్లండ్ తో వన్డేలకు జట్టులో కీలక మార్పులు.. వీరు ఇన్.. వారు ఔట్?

ఇంగ్లండ్ తో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ రంజుగా సాగుతోంది. టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన టీమిండియా తర్వాత వన్డే, టీట్వంటీలు ఇదే ఇంగ్లండ్ తో ఆడనుంది. ఈ క్రమంలోనే జట్టు ఎంపికపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ దృష్టి సారించింది. టెస్టుల్లో రాణిస్తున్న కీలక ఆటగాళ్లు ఈసారి వన్డే, టీట్వంటీలకు రానున్నారు. ఇక బౌలర్లకు విశ్రాంతినిచ్చి పాత వారు తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం. ఇంగ్లండ్ తో టెస్టుల్లో విపరీతంగా రాణిస్తున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్, బౌలర్ అశ్విన్ […]

Written By: NARESH, Updated On : February 17, 2021 10:53 am
Follow us on

ఇంగ్లండ్ తో ప్రస్తుతం టెస్ట్ సిరీస్ రంజుగా సాగుతోంది. టెస్టుల్లో స్థిరమైన ప్రదర్శన టీమిండియా తర్వాత వన్డే, టీట్వంటీలు ఇదే ఇంగ్లండ్ తో ఆడనుంది. ఈ క్రమంలోనే జట్టు ఎంపికపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ దృష్టి సారించింది. టెస్టుల్లో రాణిస్తున్న కీలక ఆటగాళ్లు ఈసారి వన్డే, టీట్వంటీలకు రానున్నారు. ఇక బౌలర్లకు విశ్రాంతినిచ్చి పాత వారు తిరిగి జట్టులో చేరనున్నట్లు సమాచారం.

ఇంగ్లండ్ తో టెస్టుల్లో విపరీతంగా రాణిస్తున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్, బౌలర్ అశ్విన్ లు మళ్లీ వన్డేల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వీరిద్దరినీ వన్డేసిరీస్ కు ఎంపిక చేయనున్నారు. రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్ ను ఎంపిక చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక గత ఏడాది ఆస్ట్రేలియాతో వన్డే , టీట్వీంటీలకు పంత్ ను పక్కనపెట్టారు. అయితే టెస్టుల్లో మాత్రం పంత్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇంగ్లండ్ తోనూ అదే ఫామ్ కనబరుస్తున్నాడు. అందుకే పంత్ కు వన్డేల్లో మరో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈసారి రిషబ్ పంత్ ను వన్డేలకు ఎంపి చేస్తారని అంటున్నారు.

ఇక చాలా రోజులుగా టెస్టు, వన్డేలు ఆడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లండ్ తో వన్డే, టీట్వంటీలకు విశ్రాంతి ఇవ్వబోతున్నట్టు సమచారం. ఇతడికి బదులుగా జట్టులోకి భువనేశ్వర్ కుమార్, షమీలు జట్టులో చేరుతారని అంటున్నారు.

ఇక టీట్వీంటీలకు ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపిక ఖాయమంటున్నారు. అతడిని మనీష్ పాండే లేదా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో తీసుకునే అవకాశం ఉందంట..

ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ మార్చి 12 నుంచి 20 వరకు జరుగునుంది. మూడు వన్డేలు 23, 26,28న జరుగుతాయి.