Homeఎంటర్టైన్మెంట్త‌ల్లిదండ్రుల‌ను రోడ్డుపై నిల‌బెట్టిన‌.. టాలీవుడ్ పెద్ద‌ల కూతుర్లు వీరే..

త‌ల్లిదండ్రుల‌ను రోడ్డుపై నిల‌బెట్టిన‌.. టాలీవుడ్ పెద్ద‌ల కూతుర్లు వీరే..

Tollywood Celebrities
కొడుకులు అమ్మ కూచీ అయితే.. కూతుళ్లు మాత్రం నాన్న కూచీ అంటారు! అవును.. దాదాపు అంద‌రూ తండ్రులూ కూతుళ్ల విష‌యంలో చాలా గారాబంగా ఉంటారు. ఇక‌, సెల‌బ్రిటీలు ఇంకెలా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. అడ‌గ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా.. కోరింద‌ల్లా తెచ్చి ముందు పెడ‌తారు. ఆవిధంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుళ్లే.. పెద్ద‌య్యాక త‌ల్లిదండ్రుల‌ను రోడ్డ‌మీద నిల‌బెట్టేస్తున్నారు. పేరెంట్స్ ప‌రువు ప‌బ్లిగ్గా తీసేస్తున్నారు. ఇలాంటి వారికి తెలుగు ఇండ‌స్ట్రీలోనూ కొద‌వ లేదు! మరి టాలీవుడ్ లో మీడియా సాక్షిగా తండ్రులను ఎదిరించిన కూతుళ్లు ఎవరో చూద్దాం.

ఈ లిస్టులో ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి కూతురు శ్రీజ గురించి. టాలీవుడ్ లో మెగాస్టార్ గా కీర్తించబ‌డుతున్న చిరు పాలిట ఆయ‌న కూతురే విల‌న్ గా ప్ర‌వ‌ర్తించింది. ఎవ‌రికీ తెలియ‌కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, తాను ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది శ్రీజ‌. ఆ త‌ర్వాత త‌న‌కూ, నా భర్తకు చిరంజీవి ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి అపాయం పొంచి ఉందంటూ మీడియా సాక్షిగా ర‌చ్చ‌చేసింది. మీరే కాపాడాలంటూ పోలీసుల‌ను, మీడియాను కోరింది. ఈ స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న లైసెన్స్డ్ రివాల్వ‌ర్ కూడా స్టేష‌న్లో అప్ప‌గించారు. అప్ప‌ట్లో ఈ సంఘ‌ట‌న రేకెత్తించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. కానీ.. ఆ త‌ర్వాత కొంత కాలానికి మొగుడు మంచివాడు కాదంటూ.. తండ్రి చెంతకు చేరింది శ్రీజ‌.

Also Read: టాలీవుడ్ కోసం రూ.500 కోట్లు దానమిచ్చాడు.. ఆ నటుడు ఎవ‌రో తెలుసా..?

ఇదే కోవలో ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ చేసే రచ్చ అలా ఇలా ఉండదు. ఆమె ఇప్ప‌టికీ.. ప‌బ్లిగ్గా తండ్రిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. త‌న‌ను చంపాల‌ని చూశాడ‌ని కూడా గ‌తంలో వ్యాఖ్యానించారు వ‌నితా. అంతేకాదు.. త‌న‌ తండ్రి పెద్ద తాగుబోతు అని, డ్రగ్స్ కి బానిసయ్యాడ‌ని, త‌న తల్లికి మందు అలవాటు చేశాని, ఆ మత్తులో ఆస్తి మొత్తం రాయించుకున్నార‌ని ఆరోపించింది వ‌నితా. ఆ విధంగా త‌న‌కు చిల్లిగ‌వ్వ కూడా రాకుండా చేశాని మీడియాతోనే అనేశారు. ఇప్ప‌టికీ ఇంట‌ర్వ్యూల‌లో ఈ విష‌యం చెప్తూనే ఉంటుంది వ‌నితా. వీళ్లింట్లోని వారంతా దాదాపు ప్ర‌ముఖ న‌టులుగా వెలుగొందిన వారే. కానీ.. రియ‌ల్ లైఫ్ లో మాత్రం ఇలా పోట్లాడుకుంటున్నారు.

ఇక‌, తండ్రిని ప‌బ్లిగ్గా స‌వాల్ చేసింది రామ్ గోపాల్ వర్మ కూతురు. అది కూడా సోషల్ మీడియా వేదిక గా సాగింది. సాధార‌ణంగా పవన్ కళ్యాణ్ ను ఎవరయినా అభిమానిస్తారు. ఇక‌, ఆయ‌న అభిమానుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఫ్యాన్స్ భ‌క్తులుగా మారిపోయి ఆరాధిస్తారు. ఆర్జీవీ కూతురు కూడా ఇంచుమించు అలాగే చేసింది. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తే.. కూతురు ఊరుకునేది కాదు. వ‌ర్మ మాత్రం.. కావాల‌నే పవన్ కళ్యాణ్ తోపాటు మెగా ఫ్యామిలీ ని గెలికేస్తూ ఉంటాడు. ఈ విష‌యంలో తండ్రీకూతుళ్లు ట్విట్ట‌ర్ సాక్షిగా యుద్ధం చేశారు. ‘నువ్వు ఎలా అయినాగానీ ఉండు కానీ.. మా పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాత్రం ఊరుకోను.’ అని వార్నింగ్ ఇచ్చింది కూతురు. దీంతో.. అందరూ ఆశ్చర్యపోయారు.

Also Read: అందాల రాశిని వ‌రించిన‌ సుంద‌రాంగుడు ఎవ‌రో తెలుసా?

ఇక‌, ప్ర‌ముఖ హీరోయిన్‌ ఆర్తీ అగ‌ర్వాల్‌.. త‌న‌ తండ్రి వల్ల ప్రాణహాని ఉందంటూ సంచ‌ల‌నం రేపింది. త‌న‌ను డబ్బు సంపాదించే మిషన్ లా చూస్తున్నారని ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆమె కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న స‌మ‌యంలో త‌రుణ్ ను ప్రేమించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో.. ఎక్కడ త‌న‌ కూతురు పెళ్లి చేసుకొని వెళ్లిపోతుందేమోన‌ని ఆర్తీ తండ్రి ఆమెను కంట్రోల్ చేయాలని భావించాడట. ఇది భరించలేకనే మెట్ల మీద నుండి దూకి ఆత్మహత్య యత్నం చేసిందట ఆర్తి. అయితే.. అంద‌రూ త‌రుణ్ ఆమె ప్రేమ‌ను కాద‌న‌డం వ‌ల్లే ఆత్మహత్యకు య‌త్నించింద‌ని అనుకున్నారు. చివ‌ర‌కు ఆర్తీ జీవితం అర్ధాంతరంగానే ముగిసిపోవడం బాధాక‌రం.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఈ విధంగా చిత్ర‌ ప్ర‌ముఖులు విష‌యంలో కూతుళ్లు విల‌న్ గా మారారు. అయితే.. ఇవి బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యాలు మాత్ర‌మే. కానీ, చాలామంది సెలెబ్రిటీల ఇళ్ల‌లోనూ ఇలాంటి వ్య‌వ‌హారాలు, ఇంత‌కంటే పెద్ద‌వే ఉన్న‌ప్ప‌టికీ.. అవి బ‌య‌ట‌కు రాకుండా గుట్టుగా స‌ర్దేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

1 COMMENT

Comments are closed.

Exit mobile version