కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు..: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం

శాసనసభ ఎన్నికలకు ముందు పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పర్యటించనున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 18 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తోంది. ముఖ్యమంత్రి నారాయణస్వామి కేబినెట్ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే తీప్పైనాథన్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. […]

Written By: Srinivas, Updated On : February 17, 2021 10:37 am
Follow us on


శాసనసభ ఎన్నికలకు ముందు పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు పర్యటించనున్న వేళ ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలకు గాను 18 మంది సభ్యుల బలమున్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తోంది. ముఖ్యమంత్రి నారాయణస్వామి కేబినెట్ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే తీప్పైనాథన్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

Also Read: ఏడాదిపాటు మ్యాగి తిని బతికిన అతడే.. నేడు స్టార్‌‌ క్రికెటర్‌

ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మొన్న రాజీనామా చేయగా, మరో ఎమ్మెల్యే జాన్ కుమార్ నిన్న రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను స్పీకర్ శివకొళుందు ఆమోదించారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. అయితే.. సీఎం నారాయణస్వామి మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, పూర్తి మెజారిటీ ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిబంధనల మేరకు ముందుకెళ్లనున్నట్టు చెప్పారు.

Also Read: మాటలకందని విషాదం.. 37మంది ప్రాణాలు జలసమాధి

కాగా, పుదుచ్చేరిలో అధికార పక్షంలో స్పీకర్‌తోపాటు కాంగ్రెస్‌కు 10, డీఎంకేకు 3, స్వతంత్రులు ఒకరు ఉండగా, ప్రతిపక్షంలో ఎన్నార్ కాంగ్రెస్‌కు ఏడుగురు, అన్నాడీఎంకేకు 4, బీజేపీకి ముగ్గురు (నామినేటెడ్) సభ్యులు ఉన్నారు.దీనిపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ.. తమ ప్రభుత్వం మెజార్టీ కోల్పోలేదని చెప్పారు. రాహుల్‌ గాంధీ పర్యటనపై చర్చించి.. మైదానంలో ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి మెజార్టీ ఉందని.. రాజ్యాంగ నిబంధనల మేరకు వ్యవరిస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఈ పరిణామాలు ఇలా ఉంటే.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ కిరణ్‌ బేడీపై వేటు పడింది. ఆమెను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ గవర్నర్‌‌ తమిళిసై సౌందరరాజన్‌కు పుదుదచ్చేరి అదనపు బాధ్యతలను అప్పగించారు. అక్కడ మళ్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ను నియమించే వరకూ ఈ బాధ్యతలను నిర్వర్తించాలని తెలిపారు.