https://oktelugu.com/

హస్తినకు కేసీఆర్.. ప్రధానిని కలుస్తారా?

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు సాగుతోన్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. ఈక్రమంలోనే వరుస ఎన్నికల్లో అధికార పార్టీకి కమలదళం గట్టి షాకులిస్తోంది. మొన్నటి దుబ్బాక.. నిన్నటి జీహెచ్ఎంసీలో కారు స్పీడుకు కాషాయదళం స్పీడ్ బ్రేక్ వేసింది. దీంతో కారు ముందుకెళ్లలేని పరిస్థితి వచ్చింది. Also Read: టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు..! తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో సీఎం కేసీఆర్ సైతం కేంద్రంతో పోరుకు సిద్ధమమ్యారు. దీంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 10, 2020 / 10:37 AM IST

    kcr modi

    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు సాగుతోన్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. ఈక్రమంలోనే వరుస ఎన్నికల్లో అధికార పార్టీకి కమలదళం గట్టి షాకులిస్తోంది. మొన్నటి దుబ్బాక.. నిన్నటి జీహెచ్ఎంసీలో కారు స్పీడుకు కాషాయదళం స్పీడ్ బ్రేక్ వేసింది. దీంతో కారు ముందుకెళ్లలేని పరిస్థితి వచ్చింది.

    Also Read: టీఆర్ఎస్ కు కొత్త తలనొప్పి.. ఎమ్మెల్యేలకు ఐటీ నోటీసులు..!

    తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో సీఎం కేసీఆర్ సైతం కేంద్రంతో పోరుకు సిద్ధమమ్యారు. దీంతో నిన్నటి వరకు కేంద్రంతో సఖ్యత ఉన్న కేసీఆర్ ఇటీవల భారత్ బంద్ నేపథ్యంలో ప్లేట్ ఫిరాయించారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాడుతుందనే సాకుతో కేంద్రంపై పోరుకు సిద్ధమయ్యారు. దీంతో ఇరుపార్టీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.

    ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి పర్యటనకు సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. కేసీఆర్ మూడు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసి బీజీబీజీగా గడుపనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుసుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎంవో ప్రధాని అపాయింట్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

    Also Read: రైతుల ఆందోళనలపై వెనక్కి తగ్గని ప్రభుత్వం..!

    ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైతే సీఎం ప్రధానితో బేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పర్యటనలోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకొని రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించనున్నారని సమాచారం.

    దీంతోపాటు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారనే టాక్ విన్పిస్తోంది. కేసీఆర్ ఉన్నట్టుండి హస్తినకు వెళ్లనుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఓవైపు కేసీఆర్ కేంద్రంతో అమీతుమీకి సిద్ధమవుతుండటంతో ప్రధాని అపాయింట్మెంట్ కోరడం చర్చనీయాంశంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్