
రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవగా, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో పగటిపూట సగటు అధికంగా, రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత 7.1 డిగ్రీలకు పడిపోయింది. ఈ సీజన్‌లో ఇది అతి తక్కువ ఉష్ణోగ్రత అని అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లాల్లోని 9 మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల కన్నా తక్కువకు చేరిందని తెలిపారు.