రాహుల్ పై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్..!

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండగా కాంగ్రెస్ మాత్రం వెనుకబడి పోతుంది. Also Read: బీజేపీ కార్పోరేటర్లకు టీఆర్ఎస్ రూ.5 కోట్ల ఆఫర్: బండి సంజయ్ సంచలన ఆరోపణలు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైనట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ ప్రస్తుతంగా రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది. టీపీసీసీ […]

Written By: Neelambaram, Updated On : December 24, 2020 7:57 pm
Follow us on

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండగా కాంగ్రెస్ మాత్రం వెనుకబడి పోతుంది.

Also Read: బీజేపీ కార్పోరేటర్లకు టీఆర్ఎస్ రూ.5 కోట్ల ఆఫర్: బండి సంజయ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ తన పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైనట్లు కన్పిస్తోంది. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ ప్రస్తుతంగా రాష్ట్రంలో మూడో స్థానానికి పరిమితమైంది.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఆ పదవీని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లోని సీనియర్లంతా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ నేతల గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.

టీపీసీసీ రేసులో తాను కూడా ఉన్నట్లు ప్రకటించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సంగారెడ్డిలో రాహుల్‌గాంధీ బహిరంగ సభ కోసం కోట్లు ఖర్చుపెట్టినట్లు జగ్గారెడ్డి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారాయి.

Also Read: కాంగ్రెసోళ్లు ఈ ఫొటో చూస్తే పండుగ చేసుకుంటారు

తాను ఇంత చేసినా సోనియా.. రాహుల్ గాంధీకి పంపించిన లిస్టులో తన పేరు లేకపోవడం దురదృష్టకరమని వాపోయారు. కొత్తగా వచ్చిన ఇన్‌చార్జ్ తన కార్యక్రమాలను తెలుసుకోకపోవడం.. తన పేరును టీపీసీసీ లిస్టులో చేర్చకపోవడం బాధకు గురిచేసిందని తెలిపారు.

టీపీసీసీ చీఫ్ పై సోనియా.. రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను స్వాగతిస్తానని జగ్గారెడ్డి తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ చీలిపోకుండా పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని జగ్గారెడ్డి సూచించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్