
2020లో పవన్ అనేక సంచలనాలకు తెరలేపారు. ఆయన్ని ఇకపై వెండితెరపై చూడడం అసంభవం అనుకుంటే, ఏకంగా ఐదు సినిమాలు ప్రకటించి ఫ్యాన్స్ కి వరుస ట్రీట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈఏడాది చివర్లో ఆయన ప్రకటించిన మల్టీస్టారర్ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా మారింది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవిని పవన్ కి జంటగా తీసుకోవాలని అనుకుంటున్నారు.
Also Read: తొందరపడుతున్న రజనీకి కరోనా షాక్!
అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ హీరోయిన్ సాయి పల్లవిని సంప్రదించగా భారీ ఫిగర్ చెప్పి షాక్ ఇచ్చిందట. ఈ చిత్రం కోసం సాయి పల్లవి ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేశారంట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. పవన్ పక్కన ఛాన్స్ అంటే… రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా నటించడానికి హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు. క్రేజ్ అమాంతం పెంచుకొని కెరీర్ గట్టిగా నిర్మించుకోవచ్చని ప్లాన్ చేస్తారు. అలాంటిది సాయి పల్లవి ఆస్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంటే ఆశ్చర్యకరమే.
Also Read: కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ
ఈ వార్తలలో నిజం ఎంత వరకు ఉందో అనేది కూడా అనుమానమే. డబ్బుల కోసం ఎలాంటి పాత్రనైనా సాయి పల్లవి చేయదు. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండే సాయి పల్లవి, పారితోషికంతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే సినిమా చేస్తుందనే టాక్ ఉంది. అలాగే సాయి పల్లవి కొన్ని సందర్భాల్లో తన రెమ్యూనరేషన్ కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారట. కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటూ సిద్ధాంతాలు పాటించే సాయి పల్లవి, రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ చేసిందంటే ఈజీగా నమ్మేయలేం. మరి ఈ వార్తలపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ జనవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్