జగన్ ‘లేఖాస్త్రం’.. కేసీఆర్ సపోర్టు చేస్తున్నారా?

తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదుపేస్తోంది. చంద్రబాబుతోపాటు ఓ జడ్జితో తలపడుతున్న సీఎం జగన్ కు ఇప్పటికే జాతీయ ప్రముఖులు కొందరు మద్దతుగా ట్వీట్లు చేశారు. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ లు ట్వీట్ చేసి ప్రశ్నించారు. అయితే తెలుగు మీడియాలో మాత్రం చంద్రబాబు అనుకూల మీడియా ఈ వ్యవహారంపై ఒక్కటంటే […]

Written By: NARESH, Updated On : October 12, 2020 9:01 am
Follow us on

తన ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదుపేస్తోంది. చంద్రబాబుతోపాటు ఓ జడ్జితో తలపడుతున్న సీఎం జగన్ కు ఇప్పటికే జాతీయ ప్రముఖులు కొందరు మద్దతుగా ట్వీట్లు చేశారు. ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ లు ట్వీట్ చేసి ప్రశ్నించారు.

అయితే తెలుగు మీడియాలో మాత్రం చంద్రబాబు అనుకూల మీడియా ఈ వ్యవహారంపై ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాయకపోవడం విస్తుపోయేలా చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ చేయని రీతిలో అసాధారణ లేఖ రాస్తే దాన్ని కనీసం వార్తగా కూడా టీడీపీ మీడియా రాయకపోవడంపై వైసీపీ, బీజేపీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. బీజేపీ నేత , మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు దీన్ని ఖండించారు కూడా. తెలుగు మీడియా మారాలని.. స్వేచ్ఛగా వ్యవహరించాలని హితవు పలికారు.

ఇక తెలంగాణలోనూ సదురు టీడీపీ అనుకూల మీడియా జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై ఒక్క వార్త రాయలేదు. అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సొంత పత్రిక, చానెల్ తోపాటు అనూకూల మీడియా జగన్ కు బాసటగా నిలించింది.

తెలంగాణలోని కేసీఆర్ మీడియా పత్రికల్లో ప్రముఖంగా జగన్ లేఖను ఎలుగెత్తి చాటింది. మంచి అనాలసిస్ లు చేసింది. ఇక చానెల్స్ లోనూ దీనిపై చర్చలు జరిపింది. కథనాలు ప్రసారం చేసింది.

ఈ పరిణామాలను బట్టి కృష్ణా వాటర్ కోసం కొట్టుకున్నా సరే.. ఏపీ సీఎం జగన్ కు ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతుగా ఉన్నారని అర్థమవుతోంది. నిజానికి కేసీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే జగన్ చూపిన చొరవకు ఇప్పుడు టీఆర్ఎస్ బ్యాచ్ మద్దతు తెలుపుతోందని అంటున్నారు.