https://oktelugu.com/

Jagan bail: జగన్ బెయిల్ వార్తపై అత్యుత్సాహం.. ఆ జర్నలిస్ట్ పోస్టు ఊడిందట.!

Jagan bail: పనిచేసేటప్పుడు ఉత్సాహం ఉండాలి. ఒక వార్తను వేగంగా ఇవ్వాలని ప్రతి రిపోర్టర్, డెస్కుల్లో పనిచేసే జర్నలిస్టులు కోరుకుంటారు. కానీ తీర్పు రాకముందే బెయిల్ వచ్చిందని వార్త వేస్తే.. తమ అధినేతకు పాజిటివ్ గా ఉంటుందని అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమవుతుంది? పోస్ట్ ఊస్ట్ అవుతుంది.. నిన్న జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను కోర్టు కొట్టివేసిందన్న వార్త  ఓ మీడియాలో అందరికంటే ముందే పబ్లిష్ అయ్యింది. వైరల్ అయ్యింది. ఆ మీడియాలోని ఓ జర్నలిస్ట్ కోర్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2021 / 10:21 AM IST
    Follow us on

    Jagan bail: పనిచేసేటప్పుడు ఉత్సాహం ఉండాలి. ఒక వార్తను వేగంగా ఇవ్వాలని ప్రతి రిపోర్టర్, డెస్కుల్లో పనిచేసే జర్నలిస్టులు కోరుకుంటారు. కానీ తీర్పు రాకముందే బెయిల్ వచ్చిందని వార్త వేస్తే.. తమ అధినేతకు పాజిటివ్ గా ఉంటుందని అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమవుతుంది? పోస్ట్ ఊస్ట్ అవుతుంది.. నిన్న జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను కోర్టు కొట్టివేసిందన్న వార్త  ఓ మీడియాలో అందరికంటే ముందే పబ్లిష్ అయ్యింది. వైరల్ అయ్యింది. ఆ మీడియాలోని ఓ జర్నలిస్ట్ కోర్టు తీర్పు రాకముందే ఇలా అత్యుత్సాహంతో చేసిన పనికి ఇప్పుడు ఆయన ఉద్యోగం ఊడిపోయిందన్న టాక్ మీడియా సర్కిల్స్ లో సాగుతోంది…

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేశారని నిన్న సోషల్ మీడియాలో హోరెత్తింది. అందరికంటే ముందే ఓ మీడియా హౌస్ దీన్ని ప్రచురించింది. ఈ విషయంలో అందులో పనిచేసే ఓ జర్నలిస్ట్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇప్పుడు అతడి పోస్ట్ ఊస్ట్ అయ్యిందట.. ఆ మీడియా డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ నిన్న ప్రత్యేక సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు తీర్పుపై తప్పుడు వార్తలను ప్రచురించడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారని తెలిసింది.

    సదురు జర్నలిస్ట్ ఉదయం 10.53 గంటలకు సిబిఐ కోర్టు నిన్న కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందే జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కొట్టివేశారని సదురు మీడియా వెబ్ సైట్ లో పబ్లిష్ చేశాడు. ఈ పిటీషన్ వేసిన వైఎస్ఆర్‌సి ఎంపి కె. రఘురామ కృష్ణం రాజుకు షాక్ తగిలిందని వార్త వేశాడు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని వార్తను అందరికంటే ముందే తన మీడియాలో ప్రచురించాడు.

    ఈ వార్తలను వెంటనే సదురు సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేసింది. కానీ తరువాత ఇంకా కోర్టులో విచారణ కొనసాగుతోందని తెలిసి పోస్ట్.. ట్వీట్ రెండూ తొలగించబడ్డాయి, చివరికి కోర్టు జగన్ బెయిల్ రద్దు తీర్పును సెప్టెంబర్ 15 కి వాయిదా వేసింది.

    జర్నలిస్ట్ అత్యుత్సాహం వల్ల తప్పుడు కమ్యూనికేషన్ కారణంగా ఈ వార్తను తప్పుగా ప్రచురించబడ్డాయి. వెంటనే వెబ్‌సైట్.. ట్విట్టర్ నుండి ఉపసంహరించారు. అనంతరం తప్పు జరిగిందని విచారం వ్యక్తం చేస్తూ మరో పోస్ట్ చేశారు.

    కానీ అప్పటికే ఆ మీడియా హౌస్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఇది దాని ప్రతిష్టకు హాని కలిగించడమే కాకుండా నిర్వహణకు ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే ఇది కోర్టు తీర్పుకు సంబంధించిన సమస్య కావడంతో వివాదాస్పదమైంది..

    ప్రజలను.. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను అందించారని సదురు మీడియాపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఆ వార్తల క్లిప్పింగ్‌తో పాటు ట్వీట్‌ను చేసి కోర్టుకు ఫిర్యాదు చేశాడు. దీంతో సదురు మీడియా పరువు పోయినట్టైంది. ఆ మీడియా మేనేజ్‌మెంట్ వెంటనే దీనికి కారణమైన జర్నలిస్ట్‌ను ఉద్యోగంలోంచి తొలగించిందని తెలిసింది.

    జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందులు కలిగించడానికి..అతని పరువు తీసేందుకు మాత్రమే ఆ జర్నలిస్ట్ తప్పుడు వార్తలను ఉద్దేశపూర్వకంగా ప్రచురించారని వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆరోపించింది.  ఈ నెపాన్ని జర్నలిస్ట్ పై నెట్టేసింది. “అతను తమ మీడియాలో ఒక నల్ల గొర్రె. జగన్‌పై విషం చిమ్మడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. యాజమాన్యం అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి “అని వైసీపీ సోషల్ మీడియా గ్రూప్ పేర్కొంది.

    నిజానికి సిబిఐ కోర్టు రఘురామ రాజు పిటిషన్‌ను కొట్టివేసిన వార్త చాలా ముందుగానే వాట్సాప్ గ్రూపులలో ప్రసారం చేయబడింది. సదురు జర్నలిస్ట్ అదే నిజం అనుకొని అందరినీ తప్పుదోవ పట్టించారు. వెబ్‌సైట్‌లో ప్రచురించాడు. ఇది వైసీపీకి సానుకూల పరిణామం అని భావించాడు.. అతను దానిని ఉద్దేశపూర్వకంగా చేయకున్నా.. అనుకోకుండా చేసినా, ధృవీకరించకుండా వార్తలను ప్రచురించడంతో తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది!