
మాములుగా అపరిచితులతో శృంగారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరికి దొరకకుండా ప్లాన్ చేసుకుంటారు. ఎవరూ రాని ప్లేసును ఎంపిక చేసుకుంటారు.కానీ ఇక్కడ కొందరు కామాంధులు ఏకంగా పార్లమెంట్ లోనే దుకాణం పెట్టారు. తమ శృంగార వాంఛకు పార్లమెంట్ ను వేదికగా చేసుకున్నారు. ఎంపీల కేబిన్ ల కింద.. ప్రేయర్ రూంను సెక్స్ కు పర్మినెంట్ కేంద్రంగా మార్చేశారు.
ప్రజాస్వామ్యానికి వేదిక అయిన పార్లమెంట్ లో కామవాంఛ తీర్చుకున్న వైనం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. పార్లమెంట్ సిబ్బంది యథేచ్ఛగా రాసలీలలు కొనసాగిస్తూ పార్లమెంట్కు మచ్చ తెచ్చారు. ఈ ఘటనలు ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చోటుచేసుకున్నాయి. ఆ రాసలీలల వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పార్లమెంట్ ఉద్యోగి టామ్ తోపాటు ఎంతో మంది సిబ్బంది ప్రేయర్ రూమ్ ను సెక్స్ రూమ్ గా మార్చేశారు. తోటి సిబ్బందితోపాటు వేశ్యలను పిలిపించుకొని మరీ రాసలీలలు కొనసాగించారని ఆ దేశ మీడియాలో ఫొటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఒక మహిళా ఎంపీకి సంబంధించిన క్యాబిన్ కింద కూడా సెక్స్ చేసినట్టు వీడియోల్లో బహిర్గతమైంది.
పార్లమెంట్ లో సిబ్బంది రాసలీలల ఫొటోలు వీడియోలు లీక్ కావడంతో తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడం.. ప్రజలు, నాయకులు ఆందోళనలు చేయడంతో అధికార పార్టీ పరువు పోయింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
పార్లమెంట్ లో శృంగారానికి పాల్పడ్డ ఒకరిపై వేటు వేయగా.. రక్షణశాఖ మంత్రి పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు.
The Prime Minister has sacked a Coalition staffer after graphic images of sex acts inside Parliament House were leaked.
More on this story: https://t.co/NU5CAvGujp pic.twitter.com/W9GqVRwBqF
— ImAllNews (Australia) (@ImAllNews_AU) March 23, 2021
Comments are closed.