దేశంలో ప్రైవేట్ రంగంలో ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నా ఎల్‌ఐసీని ప్రజలు విశ్వసించినంతగా దేనినీ విశ్వసించరు. భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలు, కుటుంబ ఆర్థిక భద్రత కోసం ఎల్‌ఐసీ పాలసీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పెంపొందించుకున్న ఎల్‌ఐసీ ఎప్పటికప్పుడు కొత్తకొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ ప్రజలకు మరింత చేరవవుతోంది. కొన్ని ఎల్‌ఐసీ పాలసీలు పాలసీ దారులకు అదిరిపోయే లాభాలను అందిసున్నాయి.
అయితే ఎల్‌ఐసీ పాలసీలలో కోన్ని పాలసీలు మరింత ఎక్కువగా ప్రజలకు ప్రయోజనాలు అందిస్తున్నాయి. అలా ప్రజలను ఆకట్టుకుంటున్న పాలసీలలో ఎల్‌ఐసీ నివేశ్ ప్లస్ ప్లాన్ పాలసీ కూడా ఒకటి. సింగిల్ ప్రీమియం పాలసీ అయిన ఎల్‌ఐసీ నివేశ్ ప్లస్ ప్లాన్ పాలసీలో ఒకేసారి ఎక్కువ మొత్తం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ లో ఏజెంట్ల ద్వారా లేదా ఆన్ లైన్ లో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.
నిపుణులు మాత్రం అవగాహన ఉంటే ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ లో పాలసీని కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. మూడు నెలల వయస్సు నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు వాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనిష్టంగా లక్ష రూపాయల నుంచి ఇన్వెస్ట్ చేసే ఈ పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. 1.25 రెట్లు బీమా మొత్తం లేదా 10 రెట్లు బీమా మొత్తం అనే ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
10 నుంచి 25 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ ఉంటుంది. ఈ పాలసీలో చేరిన పాలసీదారులు కనీసం 5 సంవత్సరాలు డబ్బు లాకిన్ పీరియడ్ లో ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. పాలసీదారుడు మెచ్యూరిటీ గడువు తీరకముందే చనిపోతే నామినీ పాలసీ ప్రయోజనాలను పొందుతాడు. అలా కాకుండా పాలసీదారుడు జీవించి ఉంటే పాలసీ మెచ్యూరిటీ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు.