
నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం సోమవారం వెలువడనుంది. ఈ మేరకు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం ఆరు టైబుళ్లు ఏర్పాటు చేయగా మొదటి రౌండ్‌లో 600 ఓట్లు, రెండో రౌండ్‌లో 212 ఓట్లను లెక్కించనున్నారు. లెక్కింపు కేంద్రానికి ఎనిమిది మందిని అనుమతించారు. ఈ స్థానానికి 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 ఓటర్లు ఓండగా 823 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.