https://oktelugu.com/

లాభాల్లోంచి నష్టాల్లోకి నంబర్ 1 న్యూస్ చానల్ ఎలా దిగజారింది?

కరోనా దెబ్బకు రాజులు, రాజ్యాలు.. పెద్ద పెద్ద వ్యవస్థలే కుప్పకూలుతున్నాయి. మీడియా మొఘల్ రామోజీరావు లాంటి వారే తట్టుకోలేక తన ఉద్యోగులను ఈనాడు నుంచి తీసేస్తున్న పరిస్థితి. అలాంటిది తెలుగులోనే నంబర్ 1 న్యూస్ చానెల్ నిలబడుతుందా? అంటే నిలబడడం లేదనే టాక్ వినిపిస్తోంది. Also Read: కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్? అవును.. భీకర జర్నలిస్ట్ సారథ్యంలో పరుషంగా ముందుకెళ్లిన రోజుల్లో ఆ చానెల్ నంబర్ 1గా ఉండేది.. భారీ లాభాలు చవిచూసేది. కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2020 1:12 pm
    News channel

    News channel

    Follow us on

    News channelకరోనా దెబ్బకు రాజులు, రాజ్యాలు.. పెద్ద పెద్ద వ్యవస్థలే కుప్పకూలుతున్నాయి. మీడియా మొఘల్ రామోజీరావు లాంటి వారే తట్టుకోలేక తన ఉద్యోగులను ఈనాడు నుంచి తీసేస్తున్న పరిస్థితి. అలాంటిది తెలుగులోనే నంబర్ 1 న్యూస్ చానెల్ నిలబడుతుందా? అంటే నిలబడడం లేదనే టాక్ వినిపిస్తోంది.

    Also Read: కర్ర విరగలేదు.. పామును చంపిన కేసీఆర్?

    అవును.. భీకర జర్నలిస్ట్ సారథ్యంలో పరుషంగా ముందుకెళ్లిన రోజుల్లో ఆ చానెల్ నంబర్ 1గా ఉండేది.. భారీ లాభాలు చవిచూసేది. కానీ ఆ జర్నలిస్ట్ కేసీఆర్ సర్కార్ తో పెట్టుకోవడం.. ఆయన కన్నెర్ర జేయడం.. సదురు జర్నలిస్టును ఆయన పెట్టిన చానెల్ నుంచి సాగనంపి జైలుకు పంపడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ నంబర్ 1 న్యూస్ చానెల్ పగ్గాలు ఓ పెద్ద వ్యాపార వేత్త చేతికి చిక్కాయి.

    అయితే జర్నలిస్టుల సారథ్యంలో ఉన్నప్పుడు ఏ అన్యాయం.. అక్రమాలు, అవినీతిని నిష్పక్షపాతంగా చూపించిన సదురు చానెల్.. ఇప్పుడు వ్యాపారవేత్తల చేతుల్లోకి మారాక సైలెంట్ అయ్యింది. తెలంగాణలో అధికారపక్షానికి సదురు వ్యాపారవేత్త బాగా క్లోజ్. సో కేసీఆర్ పై నోరెత్తడం ఆ చానెల్ మరిచిపోయింది. ఇక ఏపీలో కాస్త జలక్ లు ఇస్తూ.. కాస్త మెత్తబడుతూ ముందుకెళుతోంది.

    మీడియాలోకి ఎప్పుడైతే వ్యాపారవేత్తలు వస్తారో.. దాంతోనే అలిగేషన్స్ మొదలవుతాయి. ఇప్పుడు తెలంగాణ సర్కార్ పై ఆ నంబర్ 1 న్యూస్ చానెల్ వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క వార్తను వండి వార్చడం లేదు.  దీంతో తెలంగాణలో రేటింగ్ పడిపోతోంది. ఆంధ్రాలోనూ జగన్ తో అలిగేషన్స్. అక్కడ కాస్త సంయమనం.. దీంతో మెరుగైన సమాజం కోసం చీల్చిచెండాడే ఆ న్యూస్ చానెల్ ఇప్పుడు వ్యాపారవేత్తకు ఉన్న అలిగేషన్స్ కారణంగా స్పీడు తగ్గించిందన్న ప్రచారం మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. షరామామూలుగానే జనాలు కూడా ఆ చానెల్ ను చూడకుండా పక్కనపెట్టేశారు.

    ఫలితంగా జర్నలిస్ట్ చేతుల్లో ఉండగా నెలకు రూ.6 కోట్ల లాభాలు అందుకున్న సదురు న్యూస్ చానెల్ ఇప్పుడు కరోనాతోపాటు అలిగేషన్ల కారణంగా భారీగా నష్టపోతోంది. మనుగడే ప్రశ్నార్థకంగా మారేలా నష్టాలు వస్తున్నాయట..

    Also Read: కబ్జాదారులకు షాక్ ఇవ్వబోతున్న జగన్ సర్కార్…?

    ఏడాదిన్నర కిందట చానెల్ ను చేజిక్కించుకున్న యాజమాన్యం ఇప్పుడు చానెల్ విషయంలో పునరాలోచనలో పడిపోయిందట.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 56 కోట్ల నష్టం వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 60 కోట్ల రూపాయలు నష్టపోయిందట.

    ఇలా లాభాల్లో ఉన్న సంస్థ వ్యాపారవేత్త చేతుల్లోకి రాగానే రెండు సంవత్సరాల్లో 115 కోట్ల నష్టం చవిచూసింది. అందుకే దానికి అనుబంధంగా ఉన్న తెలంగాణ న్యూస్ చానెల్ ను, దాంతోపాటు ఇంగ్లీష్ న్యూస్ చానెల్ ను షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. నష్టాల్లో ఉన్న గుజరాతీ చానెల్ ను మూసివేయడానికి సిద్ధమైందట..

    ఇలా లాభాల్లో ఉన్న సంస్థ నష్టాల బాట పట్టేసరికి ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఆ చానెల్ యాజమాన్యం లెక్కలేసుకుంటూ మథనపడుతోందట.. లోపం ఎక్కడుందని ఆరాతీస్తోందట.. ప్రతీ ఏడాది నష్టాలు పెరిగితే ఏం చేయాలని ఇప్పుడు పునరాలోచిస్తోందట.. అలా తెలుగులో నంబర్ 1 న్యూస్ చానెల్ కథ ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.