https://oktelugu.com/

తండ్రీకొడుకులుగా మహేష్ బాబు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ రూమర్ తెగ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ది డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని.. తండ్రి కొడుకులుగా మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని.. బ్యాంక్ అధికారి అయిన తన తండ్రి ఓ భారీ కుంభకోణంలో ప్రధాన వ్యక్తిగా ఉండాల్సి రావడం.. దాంతో కొడుకు […]

Written By:
  • admin
  • , Updated On : September 13, 2020 / 12:14 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ రూమర్ తెగ హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మహేష్ ది డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని.. తండ్రి కొడుకులుగా మహేష్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని.. బ్యాంక్ అధికారి అయిన తన తండ్రి ఓ భారీ కుంభకోణంలో ప్రధాన వ్యక్తిగా ఉండాల్సి రావడం.. దాంతో కొడుకు పాత్ర తన తండ్రిని ఎలా సేవ్ చేశాడు అనే అంశం చుట్టూ ప్లే సాగుతోందని తెలుస్తోంది. సినిమాలో తండ్రి ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుందట. ఇక ఈ సినిమా కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుందట. నిజానికి తన తండ్రిని మోసం చేస్తే.. కొడుకు రివేంజ్ తీర్చుకునే కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయినా మహేష్ ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ కారణం మాత్రం సినిమాలో మెయిన్ ఎమోషనే అట.

    Also Read: బిగ్‌ బాస్ కి లౌక్యం చూపిస్తోన్న గంగవ్వ !

    తండ్రి పాత్ర ఎమోషన్ చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మరో మహేష్ పాత్ర వేసే ప్లాన్స్ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు ట్విస్ట్ లు కూడా బాగా ఉన్నాయట. తండ్రి పాత్రకు సంబంధించి ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఒకటి క్లైమాక్స్ లో రివీల్ అవుతుందని, ఈ ట్విస్ట్ సినిమాకే కీలకంగా ఉంటుందని సమాచారం. అన్నట్టు ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. అందుకే మహేష్ పాతికేళ్ల కుర్రాడి లుక్ కోసం ప్రత్యేకంగా డైట్ ఫాలో అయ్యాడు. చివరకు వెరీ యంగ్ లుక్ లోకి మహేష్ మారిపోయాడు. పైగా చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటిస్తున్నాడు.

    Also Read: ‘ఇదే నేటి భారతం’ అంటూ కంగనాపై ప్రకాశ్ రాజ్ సెటైర్

    అయితే ఇటీవలే మహేష్ నుండి వచ్చిన యంగ్ లుక్ లో బాగా ఆకట్టుకున్న అంశం మాత్రం.. మహేష్ హెయిర్ స్టైలే. తన హెయిర్ స్టైల్ ను చాలా కొత్తగా మర్చాడు. ఆ లుక్ చూసి ఆడియన్స్ కూడా థ్రిల్ అయిపోయారు. అందుకే ఆ లుక్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ తో కలిసి 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ ప్రెస్టీజియస్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అందుకే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను పెట్టుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఆల్ రెడీ మొదలుపెట్టారు. అయితే డిసెంబర్ వరకూ కేవలం మెయిన్ యాక్షన్ షెడ్యూల్స్ ను టచ్ చేయకూడదు అని.. ఇప్పుడు కేవలం కొన్ని సోలో షాట్స్ ను మాత్రమే తీద్దామని మహేష్ మేకర్స్ కు స్పష్టం చేశాడు.